రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిది.. సీఎం రేవంత్ కు సీపీఐ సూచన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సీనియర్ నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ( Narayana ) కీలక సూచన చేశారు.

రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ అనే పాటను రూపొందించడం అభినందనీయమని నారాయణ పేర్కొన్నారు.

అయితే రాష్ట్ర చిహ్నాన్ని( State Symbol ) మార్చకపోతేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు.

అదేవిధంగా అధికారిక గేయాన్ని కంపోజ్ చేసే బాధ్యతలను సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.కళలకు హద్దులు గీయడం సరికాదన్న ఆయన కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని చెప్పారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గీతం విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement
వైరల్ వీడియో : మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం.. గాల్లో ఉండగా విమానం పైకప్పు ఓపెన్..

తాజా వార్తలు