అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రయాణం చేయడం మంచిది కాదా..?

జీవితంలో ప్రతి రోజు ఎవరైనా సరే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

అయితే కాలం కలిసి రాక పోతే తాడే పామై కరుస్తుందన్నట్లు ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు చెబుతున్నాయి.నవమి పాడ్యముల్లో తూర్పు వైపునకు,విదియ,దశమి తిధుల్లో ఉత్తరం వైపునకు, తదియ ఏకాదశుల్లో ఆగ్నేయానికి అలాగే చవతి ద్వాదశుల్లో నైరుతి వైపుకు పూర్ణిమ సప్తమి తిధుల్లో వాయువ్యానికీ, అమావాస్య అష్టమి( Amavasya Ashtami ) రోజుల్లో ఈశాన్యానికి ప్రయాణం చేయకూడదని శాస్త్రం చెబుతోంది.

కచ్చితంగా వెళ్లాల్సి వస్తే దైవ పూజ చేసుకొని వెళ్ళమని శాస్త్రం చెబుతోంది.ముఖ్యంగా చెప్పాలంటే మేషం, మిధునం, కర్కాటకం, కన్యా, తుల, ధనస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేయడం మంచిది.మనిషి మనసుపై గ్రహణ ప్రభావం ఉంటుందని శాస్త్రంలో ఉంది చంద్రగ్రహ ప్రభావం మనసు పై స్పష్టంగా ఉంటుంది పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణ కలల కలలతో ఉంటాడు చంద్రుడు జలానికి లవణానికి మనసుకి అధిపతి అందుకే సముద్రంలో పౌర్ణమి రోజు( Full moon day ) ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మన శరీరంలో కూడా నీరు లవణాలు మనసు ఉంటాయి.

వీటికి అధిపతి చంద్రుడే కాబట్టి మన శరీరానికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అయితే ఇవి అంతగా పైకి కనబడవు శరీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేమని పండితులు చెబుతున్నారు ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అందుకే ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణాలు చేయవద్దని చెబుతున్నారు మొత్తానికి పూర్ణిమ రోజు పనులు ఏవి కావు అలాగే అమావాస్య రోజు రాత్రి పూట వెలుతురు ఉండదు తక్కువ వెలుతురులో ప్రయాణం ప్రమాదకరం అని పండితులు చెబుతున్నారు చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు అందుకే అమావాస్య రోజు అందులోనూ ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
పెరుగుతో అందానికి మెరుగు.. ఇంతకీ ఏయే సమస్యకు ఎలా వాడాలో తెలుసా?

తాజా వార్తలు