ఆదాయం పెంచుకోవడమే మీ లక్ష్యమా... ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

సమాజంలో డబ్బు ఉన్న వ్యక్తికి గౌరవ మర్యాదలతో పాటు ఏదంటే అది లభిస్తుంది.డబ్బులు ఉన్న వ్యక్తికి సహజంగానే ఊరంతా బంధువులు అవుతుంటారు.

ఇక నిజమైన బంధువులు మరింత దగ్గరవుతారు.డబ్బులో అంతటి మహత్యం వుందనడంలో అతిశయోక్తి లేదు.

మంచివాడైనా తెలివి కలవాడు అయినా డబ్బు లేకపోతే ఎవరూ లెక్క చేయరు.అందుకే జీవితంలో డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యం.

అయితే ఆదాయం పెంచుకోవడం కూడా ఒక కళే! జ్యోతిష నిపుణుల ప్రకారం, ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా మీ ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా మీరు ధనాన్ని ఆకర్షించగలరు.అలాగే కెరీర్ కూడా చాలా బాగుపడుతుంది.

హిందువులు తులసిని లక్ష్మీ దేవతగా భావిస్తారు.అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు తులసి చెట్టును ఇంటిలో నాటి దానికి రోజూ పూజ చేయడం మంచిది.

రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి తులసికి నీళ్లు పోయడం ద్వారా మీకు సిరి సంపదలు విరసిల్లుతాయి.అలాగే శివలింగానికి ప్రతిరోజు పాలతో అభిషేకం చేయడం ద్వారా కూడా మీరు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

అంతేకాదు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా మీరు అధిక ధనాన్ని ఆకర్షించడం సాధ్యమవుతుంది.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

డబ్బులు బాగా సంపాదించాలంటే పైన పేర్కొన్న టిప్స్ మాత్రమే కాదు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ముఖ్యం.రిస్కు తక్కువ, రాబడి ఎక్కువ ఉన్న పథకాల్లో కాలక్రమేణా డబ్బులను పొదుపు చేయడం ద్వారా మీరు కొంతకాలానికి ధనవంతులవుతారు.అలాగే మీలో ఉన్న ఏదైనా హిడెన్ టాలెంట్‌కు పదును పెట్టి మీ ప్రతిభ తో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.

Advertisement

తాజా వార్తలు