సాధారణంగా క్షీరదాలలో పాలిచ్చేవి ఆడ జాతికి చెందినవై ఉంటాయి.మగ జాతుల నుంచి పాలు రావు.
అయితే ఒకచోట మాత్రం మగమేక అంటే మేకపోతుకు పాలు వస్తున్నాయి.దీనికి పొదుగు ఉండటమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళ్తే.రాజస్థాన్( Rajasthan ) రాష్ట్రం, కరౌలీ నగరం, సపోత్రా తాలూకా గోత్రా గ్రామంలో నివసిస్తున్న అమీర్ ఖాన్( Aamir Khan ) చాలా మేకలను పెంచుతున్నాడు.
వాటిని అడవికి తీసుకెళ్లి, వాటి కడుపునిండే వరకు మేపుతున్నాడు.అయితే అతడు పెంచుతున్న మేకల్లో ఒక మేకపోతు చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
రెండేళ్ల వయసున్న ఈ మేకపోతుకు పురుషాంగం, వృషణాలతో పాటు రెండు పొదుగులు ఉన్నాయి.ఇది మగ మేక అయినప్పటికీ పొదుగులు దానికి రావడం చూసి యజమాని మొదట ఆశ్చర్యపోయారు.
దీనికి అతను బాద్ షా అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు.
15 ఏళ్లుగా మేకలను పెంచుకుంటున్నానని, ఇలాంటి విభిన్నమైన మేకను తాను ఏనాడు చూడలేదని అమీర్ ఖాన్ చెబుతున్నాడు.ఈ మగమేకకు( Male goat ) ఉన్న పొదుపు ద్వారా పాలు కూడా వస్తాయి.ఈ విచిత్రం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
యజమాని చెప్పిన ప్రకారం, ఈ మగ మేక 24 గంటల్లో 250 గ్రాముల పాలను ఇస్తుంది.
ఇకపోతే కరణ్‌పూర్‌లోని భైరోగావ్‌లో ఈ మేకపోతును రూ.51,000కు అమీర్ ఖాన్ కొన్నాడు.తరువాత అది ఈ పాలివ్వడం గురించి తెలిసి అతను ఆశ్చర్యపోయాడు.
అంతేకాదు ఈ మేకకు చాలా డిమాండ్ కూడా వస్తోంది.ఈ నేపథ్యంలో అతను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రూ.1 లక్షకు అమ్మేశాడు.త్వరలోనే దీన్ని బంగ్లాదేశ్‌కు పంపిస్తామని యజమాని చెబుతున్నాడు.
ఈ మేకపోతు పాలు ఇచ్చేందుకు చాలా పోషకాహారాలను లాగించేస్తుంది.ముఖ్యంగా గేదె పాలు, ధోవ్ అకాసియా చెట్టు ఆకు, గోధుమ గింజలు, నానబెట్టిన పప్పును తీసుకుంటుంది.
ఏదేమైనా పాలిచ్చే మగ మేక గురించి తెలుసుకొని ఇదేం విడ్డూరం అని చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy