టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ.
ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంతో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇలా ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్ జరిగిందని చెప్పాలి.ఇక ఈ నందమూరి హీరో మాత్రమే కాకుండా మరొక హీరో కూడా విశ్వక్ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు.
నందమూరి నటసింహ బాలకృష్ణ(Balakrishna) కూడా విశ్వక్ కి సపోర్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇలా నందమూరి హీరోలు విశ్వక్ కు మద్దతు తెలపడానికి గల కారణం ఏంటి అని చర్చలు జరుపుతున్నారు.ఇక ఈ వేడుకలో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ తనని ఈ వేడుకకు ఆహ్వానించడం కోసం ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే ఆయన స్వయంగా తనతో పాటు భోజనం చేశారని చాలా మంచిగా ఆతిథ్యం ఇచ్చారని చెప్పారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం విశ్వక్ నందమూరి నటసింహం బాలకృష్ణను కలిశారు.అయితే అడగగానే ఆయన కూడా తనకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుపుతూ బాలకృష్ణతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
ఇలా నందమూరి హీరోలు ఇద్దరు ఉమ్మడిగా ఒకే హీరోకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఇంతవరకు లేదు.ముఖ్యంగా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినవారికి ఇద్దరు కలిసి సపోర్ట్ ఇవ్వలేదు కానీ విశ్వక్ సినిమాకు మాత్రం ఇలా సపోర్ట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలా నందమూరి హీరోలు విశ్వకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే విశ్వక్ తన లౌక్యంతో, తన మంచితనంతో నందమూరి హీరోల మనసు గెలుచుకున్నారని అందుకే తనకు, తన సినిమాకు మద్దతుగా ఈ అగ్ర హీరోల సపోర్ట్ లభించిందని తెలుస్తోంది.
మరి నందమూరి హీరోల సపోర్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విశ్వక్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy