మారుతి కి ప్రభాస్ సినిమా ఇవ్వడానికి కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి సందర్భం లో చాలా మంది డైరెక్టర్లు తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే డైరెక్టర్లు మాత్రం వాళ్ళు చేసే సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు ఇక ఇలాంటి వాళ్లలో మారుతి ఒకడు.

ఈయన ఏకంగా ప్రభాస్(Prabhas ) తో సినిమా చేస్తున్నాడు అంటే ఆయన రేంజ్ ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఈయన చేసిన సినిమాల్లో బలే బలే మగాడివోయ్ సినిమా ( Bhale Bhale Magadivoy )తప్ప మిగతా ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు అయినప్పటికీ ప్రభాస్ తో సినిమా చేసే రేంజ్ కి వెళ్ళిపోయాడు అంటే నిజంగా మారుతి గ్రేట్ అనే చెప్పాలి.ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ అఫీస్ వద్ద సరైన కలక్షన్స్ ని కూడా రాబట్టడం లేదు.

అయినప్పటికీ తను ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు.ఇక ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి నిజానికి మారుతి లాంటి ఒక బి గ్రేడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ తన మీదున్న నమ్మకంతో సినిమా అయితే చేస్తున్నాడు.

Advertisement

భారీ ప్రాజెక్టుల మధ్యలో ఏదో ఒక చిన్న రిలాక్సేషన్ గా ఉంటుందనే ఉద్దేశ్యం తోనే ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాతో ప్రభాస్ కి మారుతి( Maruthi ) ఏ రేంజ్ లో హిట్ ఇస్తాడో చూడాలి.ఇలాంటి క్రమంలోనే తనదైన రీతిలో సినిమా చేయడానికి తన పూర్తి ఎఫర్ట్ ను పెడుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా తో మారుతి సక్సెస్ సాధించి ప్రభాస్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.

Advertisement

తాజా వార్తలు