ఇదేందయ్యా ఇది.. ప్రసాదం కొనకుంటే ఇలా చావా బాదుతారా?

మన దేశంలో దాదాపు ప్రతి దేవాలయంలోనూ భక్తులు భగవంతుని దర్శించుకుని, తమ శక్తి మేరకు నైవేద్యాలు సమర్పిస్తారు.

అనంతరం ప్రసాదంగా పొందే ఆహార పదార్థాలు భగవంతుడి ఆశీర్వాదంగా భావించి కుటుంబానికి, స్నేహితులకు పంచిపెడతారు.

కొన్ని దేవాలయాల్లో ఈ ప్రసాదాలను ఉచితంగా(Free Prasadam) పంపిణీ చేస్తారు.మరికొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సి వస్తుంది.

అయితే ప్రసాదం కొనడం పూర్తిగా భక్తుల ఇష్టానికి అనుగుణంగా ఉంటుంది.ఎవరిని బలవంతం చేయడం, లేదా లాభం కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనైతికం.

కానీ, లక్నోలోని చంద్రికా దేవి ఆలయంలో (Chandrika Devi Temple in Lucknow)ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement
Is This It? If You Don't Buy The Prasadam, Will You Die Like This?, Chandrika De

ఇందుకు సంబంధించిన అసలు విషయంలోకి వెళితే.

Is This It If You Dont Buy The Prasadam, Will You Die Like This, Chandrika De

ఉత్తరప్రదేశ్‌ లోని లక్నో జిల్లాలో బక్షి కా తలాబ్ (Bakshi Ka Talab, Lucknow district, Uttar Pradesh)ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం చంద్రికా దేవి ఆలయంలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.లక్నో త్రివేణీనగర్‌కు చెందిన పియూష్ శర్మ(Piyush Sharma) తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఈ ఆలయానికి వెళ్లారు.ఆలయంలో దేవిని దర్శించుకుని బయటకు వచ్చిన ఆయన కుటుంబంపై స్థానిక దుకాణాదారులు అనుచితంగా ప్రవర్తించారు.

దుకాణదారులు తమ వద్ద ప్రసాదం కొనమంటూ పదేపదే వెంటపడ్డారు.పియూష్‌ ప్రసాదం(Piyush Sharma) కొనడంలో ఆసక్తి చూపకపోవడంతో దుకాణదారులు కోపానికి లోనై ఆయనపై, ఆయన కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో చెప్పులు, బెల్టులతో (sandals and belts)వారిని కొట్టారు.బాధితుల కుటుంబానికి చెందిన మహిళలు అడ్డుకునేందుకు వచ్చినా వారిని కూడా తీవ్రంగా తోసి, దూషించారు.

Is This It If You Dont Buy The Prasadam, Will You Die Like This, Chandrika De
కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

ఈ దాడిలో పియూష్ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయాలపాలయ్యారు.వెంటనే వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడ్డ ఆరుగురు దుకాణాదారులను అరెస్ట్ చేశారు.

Advertisement

ఈ దాడికి సంబంధించిన వీడియోలు చుట్టూ ఉన్న వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పెడటంతో ఇది వైరల్‌గా మారింది.ఇక ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

భక్తులపై ఈ తరహా దాడిని హత్యా ప్రయత్నంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు.దేవాలయాల వద్ద వాణిజ్య భావన కాకుండా భక్తిభావం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తాజా వార్తలు