చంద్రబాబు ఎన్నికల హామీల వెనుక ఇంత లోగుట్టు ఉందా ?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించారు .

సూపర్ సిక్స్( TDP Super 6 Manifesto ) పేరుతో ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు.

టిడిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెబుతూ,  ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాకుండా పెన్షన్లను నాలుగు వేలకు పెంచుతామని,  అది కూడా ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని కూడా హామీలు ఇస్తున్నారు.

ఇంకా అనేక హామీలు , ప్రజాకర్షగా పథకాలను చంద్రబాబు( Chandrababu ) ప్రకటించారు.వైసిపి ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కంటే , టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోలోనే ఎక్కువ ప్రజాత పథకాలు ఉన్నాయి .

Is There So Much Depth Behind Chandrababus Election Promises,tdp, Janasena, Ys

 అయితే ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, చంద్రబాబు ఇస్తున్న హామీలు ఎంతవరకు అమలవుతాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది.టిడిపి అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ప్రకటించిన హామీల అమలు అసాధ్యం అనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం చంద్రబాబు ప్రకటించిన హామీలు సక్రమంగా అమలు కావాలంటే 1,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం .కానీ ఏపీ ఆదాయం మాత్రం 85 వేల కోట్ల రూపాయలు గానే ఉంది.  దీంతో చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు అసాధ్యం అనే అభిప్రాయాలు అందరిలోనూ ఉన్నాయి.

Advertisement
Is There So Much Depth Behind Chandrababu's Election Promises,TDP, Janasena, Ys

దీంతో సంక్షేమ పథకాలకు( Welfare schemes ) చంద్రబాబు షరతులు విధించే ఆలోచనతో ఉన్నారని,  కూటమి అధికారంలోకి వచ్చినా, భారీ స్థాయిలో లబ్ధిదారులను తగ్గించడం ఖాయమని, చంద్రబాబు ఆలోచన కూడా ఇదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Is There So Much Depth Behind Chandrababus Election Promises,tdp, Janasena, Ys

కూటమి మేనిఫెస్టోలో భాగంగా మరికొన్ని హామీలను సైతం కూటమి ప్రకటించే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.దీంతో పథకాలకు అర్హుల ఎంపిక కు షరతులు పెట్టే ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లుగా  వర్గాల ద్వారా తెలుస్తోంది .ముందుగా టిడిపి కూటమి అధికారంలోకి వస్తే , ఆ తరువాత పథకాల అమలు సంగతి చూద్దామనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని,  ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే,  రాబోయే రోజుల్లో పార్టీ కోలుకోలేని స్థాయిలో బలహీనం అవుతుందని , అందుకే టిడిపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు ఎన్నికల హామీలను ప్రకటించారని , టిడిపి( TDP ) అధికారంలోకి వస్తే అమలు విషయంలో మాత్రం భారీగానే షరతులు విధించి , లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారనే అభిప్రాయాలు జనాల్లో వ్యక్తం అవు తున్నాయి.

Advertisement

తాజా వార్తలు