చిన్నారి పెళ్లికూతురు సీరియల్ యాక్టర్లను ఏదైనా శాపం వెంటాడుతుందా?

చిన్నారి పెళ్లి కూతరు.హిందీ బాలికా వధు అనే సీరియల్ ను తెలుగులోకి డబ్ చేశారు.

ఈ సీరియల్ దేశంలోనే కాదు.ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.

ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారం అయిన రామయణం, మహాభారతం సీరియల్ కు జనాల నుంచి ఎంత ఆదరణ దక్కిందో ప్రస్తుతం చిన్నారి పెళ్లికూతురు సీరియల్ కు ఆ స్థాయి ఆదరణ దొరికింది.తెలుగులో ఈ సీరియల్ ఎప్పుడూ టాప్ రేటింగ్ లో కొనసాగింది.

అయితే ఈ సీరియల్లో నటించిన పలువురు నటీనటులు వరుసగా చనిపోతున్నారు.ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

Advertisement
Is There Any Curse On Chinnari Pellikuthuru Stars , Serial, Chinnari Pellikuthur

హీరో, హీరోయిన్ తో పాటు బామ్మ కూడా చనిపోయింది.ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఏప్రిల్ 1, 2016లో ముంబైలో అనుమానాస్పద రీతిలో చనిపోయింది.

తను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.కానీ ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉందని తన తల్లిదండ్రులు కేసు పెట్టారు.

ఇప్పటికీ కోర్టుల్లో ఆ కేసుల విచారణ కొనసాగుతుంది.

Is There Any Curse On Chinnari Pellikuthuru Stars , Serial, Chinnari Pellikuthur

అటు ఈ సీరియల్ లో నటించిన బామ్మ సురేఖ 2001 జూలై 16న చనిపోయింది.70 ఏండ్ల వయసున్న ఈ బామ్మ ఎంతో యాక్టివ్ గా ఉండేది.కానీ అనుకోకుండా ఆమె ఆరోగ్యం క్షీణించింది.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

చికిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే తను చనిపోయింది.ఆమె కూడా ముంబైలోనే గుండెపోటుతో చనిపోయింది.

Advertisement

తాజాగా చిన్నారి పెళ్లి కూతురు హీరో సిద్ధార్థ్ శుక్లా సైతం చనిపోయాడు.సెప్టెంబర్ 21, 2021 రాత్రి గుండెపోటుతో చనిపోయాడు.

ఈ సీరియల్ లో హీరో పాత్ర పోషించిన ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.కేవలం 40 ఏండ్ల వయసులోనే తను చనిపోవడం అభిమానులకు షాక్ కలిగించింది.

ఇతడు కూడా ముంబైలోని తన ఫ్లాట్ లో గుండెపోటుకు గురయ్యాడు.అతడిని ఆస్పత్రికి తరలించే లోపు చనిపోయాడు.

ఇతడు బిగ్ బాస్ -13 విన్నర్ కూడా.మొత్తంగా ఈ సీరియల్ లో నటించిన ముగ్గురు కీలక పాత్రదారులు చనిపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

తాజా వార్తలు