పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Hero Prabhas ) బాహుబలి సిరీస్ తర్వాత మరో హిట్ అనేది కొట్టలేదు.
అయినప్పటికీ ఈయన మార్కెట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
పైగా రోజురోజుకూ ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.ప్రభాస్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.
ప్రజెంట్ ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టగా ఆ సినిమాలన్నీ వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.వీటిల్లో యంగ్ డైరెక్టర్ మారుతి( Young Director Maruthi ) దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఒకటి.ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు టాక్.
ఇప్పటి వరకు ఈ సినిమాకు డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్, రాజా డీలక్స్ అనే పేర్లు వైరల్ అయ్యాయి.ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నట్టు టాక్.
అందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) ను ఇప్పటికే ఫైనల్ చేయగా మరో ముద్దుగుమ్మ ఇంకా ఫిక్స్ కాలేదు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.త్వరలోనే అఫిషియల్ అప్డేట్ కూడా రాబోతుందని టాక్.
2024 లోనే రిలీజ్ అవుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) భావిస్తుండగా ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో నిజంగానే 2025 వరకు ప్రభాస్ మారుతి మూవీ రిలీజ్ అవ్వదేమో అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.కాగా ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉండడంతో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఫుల్ కామెడీ జోన్ లో తెరకెక్కుతుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy