'పుష్ప 2' ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి లైన్ క్లియర్ అయిందా..?

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) బాలీవుడ్ లో భారీ రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతుంది.

ఇక పుష్ప 2 సినిమా నుంచి రీలోడెడ్ వెర్షన్ గా మరో అదనపు 20 నిమిషాల పుటేజ్ ని ఆడ్ చేస్తూ జనవరి 17వ తేదీ నుంచి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించినప్పటికి ఇండియాలో మాత్రం తెలుగు సినిమా సత్తాను నిలబెట్టిందనే చెప్పాలి.అలాగే ఇప్పుడు 20 నిమిషాల నిడివి ఉన్న సీన్ల ను కలుపుతున్న నేపధ్యం లో సినిమా మీద మరోసారి భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.

ఇక సినిమా ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు.తద్వారా దంగల్ సినిమా( Dangal Movie ) రికార్డును బ్రేక్ చేసి ఇండియాలో నెంబర్ వన్ సినిమా గా పుష్ప 2 సినిమాను నిలిపాలనే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా పుష్పరాజ్ ఈ సినిమాతో భారీ విధ్వంసాన్ని సృష్టించాడు.

ఇప్పటికే ఈ సినిమా ద్వారా 19 కోట్ల కలెక్షన్లను రాబట్టిన అల్లు అర్జున్ మరొక 100 కోట్లు వస్తే దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసిన వాడవుతాడు.తద్వారా ఇండియాలో తను నెంబర్ వన్ హీరో కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

ఇక ఇప్పటికే పుష్ప మొదటి పార్ట్ తో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్టునే కొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్టుగా నిలవడం ఇప్పుడు వాళ్లకే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా గర్వకారణంగా నిలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు