ఆ మాజీ మంత్రీ సర్దుకుంటున్నారా ? ఇంకెంతమందో ...

బీఆర్ఎస్( BRS party ) ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.

కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీఆర్ఎస్ అధిష్టానం పై విమర్శలు చేస్తుండగా, మరి కొంతమంది అలక చెందారు .

ఇంకొంతమంది కాంగ్రెస్ బిజెపిలలో  చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇలా అసంతృప్తి గురైన వారిలో ఎక్కువమంది మాజీ మంత్రులు, సీనియర్ నాయకులే కావడం గమనార్హం.కెసిఆర్ ( CM kcr )కచ్చితంగా తమకు టికెట్ ఇస్తారని ,వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశలు పెట్టుకున్న నేతలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు .మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు( Motkupally narasimhulu ) కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .

అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారు.అయితే ఇప్పుడు ఆ ఆశలు తీరకపోవడంతో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.నిన్ననే తన అనుచరులతో యాదగిరిగుట్టలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

Advertisement

కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితుబంధు పథకం ప్రారంభానికి ముందు మోత్కుపల్లి నరసింహులు సలహాలు సూచనలు కేసీఆర్ తీసుకున్నారు.కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు.ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆవేదన చెందుతున్నారు.

టికెట్లు ప్రకటించే సమయంలోనైనా .సిట్టింగులకే టికెట్లు ఇస్తున్నామని తనకు మాటవరసకైనా చెప్పలేదని ఆవేదన చెందుతున్నారు.దీంతో పార్టీ మారాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నారట.

దీంతో ఏ పార్టీ టికెట్ దక్కుతుందా అనే అంశం పైన మోత్కుపల్లి ఆరా తీస్తున్నారట .

టికెట్ దక్కే అవకాశం ఉంటే .వెంటనే బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి పార్టీ మారాలనే ప్లాన్ లో ఉన్నారట.ఇక ఇప్పటికే చాలామంది టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

నకిరేకల్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) పార్టీకి రాజీనామా చేశారు.  అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు .మరో వారం రోజుల్లో ఏ పార్టీలో చేరబోతున్నారనేది ప్రకటిస్తానని తెలిపారు.ఇదేవిధంగా టికెట్ దక్కని ఆశావాహులు చాలామంది ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలు ఉండడంతో,  బీఆర్ఎస్ కూడా ఈ వ్యవహారాలపై టెన్షన్ పడుతోంది.

Advertisement

తాజా వార్తలు