Dasari Narayana rao : దాసరి గారు లేకపోవడం వల్ల చిన్న ప్రొడ్యూసర్లు కు, దర్శకులకు అన్యాయం జరుగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ వస్తుంది అంటూ చిన్న నిర్మాతలు గాని, దర్శకులు గాని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

అయితే ఇంతకు ముందు ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు( Dasari Narayana rao ) గారు ఉన్నప్పుడు చిన్న సినిమాలు బతికాయి కానీ ఇప్పుడు మాత్రం చిన్న సినిమాలను చంపేస్తున్నారు అంటూ మరి కొందరు వాళ్ల బాధని చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే పండగల సీజన్ లో ఎప్పుడు పెద్ద సినిమాలని థియేటర్లో రిలీజ్ చేస్తూ ఉంటారు.చిన్న సినిమాలకు అసలు థియేటర్లు దొరకవు ఇది ఒకటి అయితే, ఇక చిన్న సినిమాలకు అసలు ఏ రకమైన సక్సెస్ రాకుండా కొంతమంది పెద్ద నిర్మాతలు సైతం అడ్డుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక కొంతమంది నిర్మాతలైతే చిన్న సినిమాని హోల్ సేల్ రేట్ కి కొనుక్కొని వాళ్లే ప్రొడ్యూసర్లుగా రిలీజ్ చేసుకుంటున్నారు.దానివల్ల వాళ్ళు చాలా డబ్బుల్ని కూడా సంపాదిస్తున్నారు కానీ దీనివల్ల ప్రొడ్యూసర్లు( Producers ) నష్టపోతున్నారు మాకు న్యాయం చేసే వ్యక్తి ఎవరూ లేరా అంటూ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నిర్మాతలు గాని, చిన్న హీరోలు గానీ, చిన్న దర్శకులు అందరూ వాళ్ళని ఆదుకునే వాళ్లకోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి( Chiranjeevi ) ఉంటాడు అని కొంతమంది ఆశిస్తున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇంకొంతమంది వాదిస్తున్నారు.ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తే తప్ప చిన్న సినిమాలకు న్యాయమైతే జరగదు.ఇక ఇప్పుడున్న వాళ్ళల్లో చిరంజీవి అయితేనే ఇండస్ట్రీ పెద్దగా అందరిని ఆదుకుంటాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Advertisement

చూడాలి మరి ఇండస్ట్రీ పెద్ద గా చిరంజీవి ఉంటాడా లేదా అనేది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు