ఆ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా ?  ఒకటే హడావిడి

ఊహించని స్థాయిలో స్థానాలను దక్కించుకుని ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది.

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) దూకుడుగా వ్యవహరిస్తున్నారు.పాత చంద్రబాబు కాదు ,కొత్త చంద్రబాబును చూస్తారని,  పరిపాలన పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు.

ఎన్నికల్లో టిడిపికి సొంతంగా మెజార్టీ స్థానాలు దక్కాయి.అయినా వైసీపీని బలహీనం చేసే విషయంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Is That Ycp Mla Changing Party , Tdp, Janasena, Bjp, Pavan Kalyan, Janasenani, Y

గత వైసిపి ప్రభుత్వంలో,  ప్రభుత్వ పథకాలకు పెట్టిన పేర్లను మార్చుతూ పూర్తిగా తన మార్క్ కనిపించే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో పాటు వైసీపీ కీలక నాయకులను తమ పార్టీలు చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటికే వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉనట్లుగా టిడిపి వర్గాలు లీకులు ఇస్తున్నాయి.

Advertisement
Is That YCP MLA Changing Party , Tdp, Janasena, Bjp, Pavan Kalyan, Janasenani, Y

దీనికి తగ్గట్లుగానే కొన్ని వ్యవహారాలు చోటు చేసుకుంటూ ఉండడం తో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్ష (Aaluru mla virupaksha )టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతోంది.

వైసీపీలో ఉండడం వల్ల తమ పనులు జరగవనే అభిప్రాయంతో టీడీపీలో చేరేందుకు విరూపాక్ష సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .

Is That Ycp Mla Changing Party , Tdp, Janasena, Bjp, Pavan Kalyan, Janasenani, Y

పార్టీ మార్పు వార్తలు పెద్ద ఎత్తున వస్తుండడంతో,  ఇటీవల జగన్ ను కలిసిన విరుపాక్ష తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు.  తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  అయితే ఆయన కేడర్ మాత్రం పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారట.

ఒకపక్క పార్టీ మారడం లేదని విరూపాక్ష క్లారిటీ ఇస్తున్నా.ఆయన అనుచరులు టిడిపిలో చేరుతున్నామనే సంకేతాలు ఇస్తుండడంతో విరుపాక్ష పైన అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు