NT Kodali Nani : కొడాలి నానితో ఎన్టీఆర్ తెగదెంపులకు కారణం అదే.. అసలేం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులు అన్న విషయం తెలిసిందే.అది ఒక రహస్యం కాదు.

హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఆది సినిమా నిర్మాణం విషయంలో కొడాలి నాని కూడా కీలక పాత్ర పోషించారు.

వీరిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారట.కానీ రాజకీయాల కారణంగా వారి మధ్య దూరం పెరిగిందట.

అంతేకాకుండా రాజకీయాలు వారి సంబంధాలను తెంచాయట.కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్,కొడాలి నాని ఎందుకు విడిపోయారు అన్న విషయం మాత్రం బయటికి రాలేదు.

Advertisement
That Is The Reason For NTR Breakup With Kodali Nani What Actually Happened , Nt

కాగా తాజాగా ఈ విషయంపై దర్శకుడు వివి వినాయక్ స్పందించారు.ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాకు దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని విషయాలు గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.

జూనియర్ ఎన్టీఆర్,కొడాలి నాని చాలా మంచి స్నేహితులు.ఒక్కసారిగా రాజకీయ కోణం రావడంతో వారిద్దరూ విడిపోయారు.

నాని వైఎస్ఆర్సీపీ లో చేరడంతో ఒకరికొకరు సంబంధాలు తెగిపోయాయి.అప్పటి వరకు వారు అన్ని సమయాలలో కలిసి ఉన్నారు.

That Is The Reason For Ntr Breakup With Kodali Nani What Actually Happened , Nt
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

కానీ రాజకీయ పార్టీలు కుటుంబాలు వారి మధ్య అంతరాన్ని పెంచాయి.నాని వైసీపీలో చేరిన రోజే ఎన్టీఆర్ తో సంబంధాలు తెగిపోయాయని అనుకుంటున్నాను అని వినాయక్ తెలిపారు.అలాగే ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎన్టీఆర్ ఒక కంపోజ్డ్ మనిషి అని ఒక మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలి ఎక్కడ హద్దులు పెట్టాలీ అన్నది తనకు బాగా తెలుసు అని వివి వినాయక్ తెలిపారు.

Advertisement

అలాగే ఎన్టీఆర్ కొడాలి నాని వినాయక్ కాంబినేషన్ లో భవిష్యత్తులో ఒక సినిమా చేసే అవకాశం ఉందని వినాయక్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే దర్శకుడిగా సినిమాలు ప్రస్తుతం వివి వినాయక్ తీయడం లేదు అన్న విషయం తెలిసిందే.

ఫ్లాప్ లతో ఆయన కెరీర్ కు స్టాప్ పడింది.మరి వినాయక్ భవిష్యత్తు ఏమిటో చూడాలి మరి.

తాజా వార్తలు