శ్రీరెడ్డి ఆ ఫ్యామిలీ నుండి సెటిల్‌మెంట్‌ కోరుకుంటుందా

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీరెడ్డి.ఈ అమ్మడు అత్యంత వివాదాస్పద ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం శ్రీరెడ్డి టాలీవుడ్‌కు చెందిన పలువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పబ్లిసిటీ పొందుతుంది.కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌కు చెందిన వారిపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి తమిళ సినిమాల్లో ఆఫర్లు రావడంతో అక్కడకు వెళ్లింది.

అయితే శ్రీరెడ్డి మళ్లీ ఇక్కడకు వచ్చి నాని, దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దగ్గుబాటి ఫ్యామిలీ నుండి శ్రీరెడ్డి సెటిల్‌మెంట్‌ కోరుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకే మళ్లీ ఇలా దగ్గుబాటి ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తుంది.దగ్గుబాటి ఫ్యామిలీ వారు భారీగా డబ్బు ఇవ్వాలని ఈమె సన్నిహితులతో అంటున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

పెద్ద మొత్తంలో తాను కోరిన విధంగా డబ్బు ఇస్తే అప్పుడు సైలెంట్‌ అవుతాను అంటూ చెబుతోంది.పదే పదే ఈ విషయాన్ని శ్రీరెడ్డి ప్రస్థావించకుండా ఉండాలి అంటే వెంటనే సెటిల్‌మెంట్‌ చేసుకోవాలట.

ఒక వేళ శ్రీరెడ్డితో ఆ ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌ చేసుకుంటే, ఆ విషయం బయటకు వస్తే మరింతగా ఆ ఫ్యామిలీ పరువు పోవడం ఖాయం.అందుకే దగ్గుబాటి వారు ఛాలా రోజులుగా కూడా సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోవడం లేదు.శ్రీరెడ్డి ఎన్నిరోజులు మొత్తుకుంటుందో మొత్తుకోనివ్వండి అంటూ ఆ ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు అంటున్నారట.

మొత్తానికి శ్రీరెడ్డి ఇష్యూ మరింతగా మళ్లీ ముదిరిన నేపథ్యంలో టాలీవుడ్‌లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.

తాజా వార్తలు