బుట్టబొమ్మ సిద్ధు చేయాల్సిందా..!

మళయాళ సూపర్ హిట్ సినిమా కప్పెలని తెలుగులో బుట్టబొమ్మ అంటూ రీమేక్ చేశారు.

అర్జున్ దాస్, అనైకా, సూర్య వశిష్ట లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా శనివారం రిలీజైంది.

సినిమా ట్రైలర్ తో ఆకట్టుకోగా ఒక మంచి కథని అనుకున్నంత రేంజ్ లో తీయలేకపోయారు అన్న టాక్ వచ్చింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనైకా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

అయితే హీరోయిన్ అయినా కూడా ఆమె ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గానే అనిపించింది.వెయిట్ ఉన్న పాత్ర ఆమె మోయలేకపోయింది అని చెప్పొచ్చు.

ఇక అర్జున్ దాస్ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమే.ఇక సూర్య వశిష్ట మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Advertisement

ఒరిజినల్ వర్షన్ లో రోషన్ మ్యాథ్యూ బాగా చేశాడు.అయితే సూర్య వశిష్ట చేసిన ఈ పాత్రలో దర్శక నిర్మాతలు ముందు డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డని తీసుకోవాలని అనుకున్నారట.

కానీ అతను చేయనని చెప్పేసరికి సూర్యకు ఛాన్స్ వచ్చింది.బుట్టబొమ్మలో సిద్ధు చేసి ఉంటే మరో లెవెల్ లో ఉండేదని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు