అనిమల్ సినిమా సందీప్ చేసింది కరెక్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటుల వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

అయితే ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా ఎదిగిపోతూ ఉంటారు.

వీళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నెట్ లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) కూడా పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుదు ఆయన తీసిన అనిమల్ సినిమా( Animal movie ) బాక్స్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది.ఇక ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాని రన్బీర్ కపూర్ తో తీశాడు.ఆయన యాక్టింగ్ కూడా బాగా చేశాడు.

Advertisement

కానీ కొంతమంది మాత్రం రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) తో సినిమా చేసేకంటే మన రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండను పెట్టి అనిమల్ సినిమా చేసి ఉంటే విజయ్ దేవరకొండకు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు,గుర్తింపు వచ్చేది కదా ఆ బాలీవుడ్( Bollywood ) హీరోను పెట్టేకంటే మన తెలుగు హీరోని పెట్టి చేస్తే బాగుండేది కదా అని కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇంకా మరి కొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ చేసింది కరెక్టే రన్బీర్ కపూర్ కి ఉన్నంత మార్కెట్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కి లేదు.కాబట్టి విజయ్ తో సినిమా చేస్తే ఈ సినిమా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసేది కాదు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే సందీప్ మాత్రం ఇప్పుడు ఇండియా లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు