కాపుల్ని పవన్ దూరం చేసుకుంటున్నారా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది .

ముఖ్యంగా పొత్తుల పేరుతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్న ఇరు పార్టీలు కార్యకర్తల ఐక్యతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి.

అయితే గత కొన్ని ఏళ్లుగా అధికారం పై ఆశలు పెంచుకున్న కాపు సామాజిక వర్గానికి చాలా కాలం తర్వాత బలంగా నిలబడిన నాయకుడిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కనబడటంతో ఆ సామాజిక వర్గం యువత అంతా గంప గుత్తగా పవన్ కు మద్దతు పలికారు .

ఆయన వరాహి యాత్ర(Varahi Yatra )ల దగ్గర నుంచి బహిరంగ సభల వరకూ అన్ని వర్గాలు కన్నా ఎక్కువగా మద్దతు ఆ సామాజిక వర్గం నుంచే వచ్చిందన్నది బహిరంగ రహస్యం .అయితే కేవలం జగన్ ప్రభుత్వాన్ని దింపడమే లక్ష్యంగా అన్ని విషయాలలోనూ కాంప్రమైజ్ అవుతున్న ధోరణిలో జనసేన రాజకీయ ప్రయాణం ముందుకు కదలడంతో ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లుగా తెలుస్తుంది.నిన్న మొన్నటి వరకూ అన్ని విషయాల్లో పవన్ కు మద్దతు నిలిచిన కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హర రామ జోగయ్య( Hara Rama Jogaiah ) కూడా ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో పై పెదవి విరిచారు.

జగన్ ప్రభుత్వాన్ని ఢీకొనే సత్తా ఈ కా మేనిఫెస్టో కు లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

అంతేకాకుండా సమన్వయ కమిటీలలోనూ , సీట్ల కేటాయింపుకు సంబంధించిన చర్చల్లోనూ కూడా కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందన్న ఆలోచనలో కాపు సామాజిక వర్గం ఉన్నదని వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం( TDP ) ఏర్పాటుకే పవన్ సహకరిస్తున్నారు తప్ప అధికారం లో వాటా పొందేటట్టుగా గాని కీలకమైన కొంతమంది నాయకుల్ని గెలిపించేటట్టుగా కానీ జనసేన ముందుకు వెల్లట్లేదు అన్న అసంతృప్తి చాలామందిలో కనిపిస్తున్నట్లుగా వారి వారి సోషల్ మీడియా పోస్టులను చూస్తుంటే అర్థమవుతుంది .ఇటీవల కాలంలో కూడా చాలామంది హార్డ్ కోర్ నాయకులు ఆ పార్టీకి దూరం అవటం దీనికి సంకేతంగా చెప్పవచ్చు.మరి అతి పెద్ద బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్న జనసేనకు వచ్చే ఎన్నికలలో ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత తొందరగా పవన్ ఆయా వర్గాలతో సమన్వయం చేసుకుంటే మంచిదన్న కోణం లో విశ్లేషణలు వస్తున్నాయి .

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు