రాజమౌళి అడిగితే సితార విషయంలో మహేష్ బాబు ఓకే చెప్పడం ఖాయం

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లింది.

నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా దక్కిన విషయం తెల్సిందే.

హీరోలుగా నటించిన రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క స్థాయి అమాంతం పెరిగింది.అందుకే ఆయన దర్శకత్వంలో తదుపరి సినిమాను చేయబోతున్న మహేష్ బాబు( Mahesh babu ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందనున్న మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమాలో సితార నటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వస్తున్న సీతూ పాపను( Sitara ) వెండి తెరపై చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.అది ఎప్పటికి సాధ్యం అవుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.అసలు సీతూ పాపతో నటింపజేసే అవకాశం ఉందా.

Advertisement

మహేష్ బాబు ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.ఒక వేళ రాజమౌళి కనుక తన తదుపరి సినిమా లో సీతూ పాపను చూపించాలని భావిస్తే మాత్రం తప్పకుండా మహేష్‌ బాబు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజమౌళి కంటే గొప్ప దర్శకుడు మహేష్‌ బాబుకు సితార ఎంట్రీకి దొరికే ఛాన్స్ లేదు.కనుక మహేష్‌ బాబు కచ్చితంగా రాజమౌళి కి సీతూ పాపను అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.సితారను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్‌ బాబు మరియు నమ్రత ఉంటే కనుక ఇంత కంటే మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మహేష్ బాబు.రాజమౌళి కాంబో సినిమాలో సితార గురించిన వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు