కేసీఆర్ ధీమా అదేనా ? గెలుపుపై నమ్మకం కుదిరిందా ? 

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) తెలంగాణ ఎన్నికల్లో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామనే ధీమాతో ఉన్నారు.

ప్రత్యర్థులు ఎంత బలపడినా, పొత్తులతో తమను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నా, కేసీఆర్ ఏమాత్రం కంగారు పడటం లేదు.

విమర్శలతో ప్రత్యర్థులను ఇరుక్కున పెట్టగల వాక్చాతుర్యం కేసిఆర్ సొంతం కావడంతో,  ఆయన అదే తన ఆయుధంగా మార్చుకుని ప్రత్యర్థులపై యుద్ధానికి దిగుతున్నారు.ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం అనే అభిప్రాయం జనాల్లో కలిగే విధంగా కేసీఆర్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ , మధ్యలో తెలంగాణ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రజల్లోకి పెద్దగా వెళ్ళింది లేదు.

 ప్రజలను కలవకపోవడమే కాకుండా,  ఎమ్మెల్యేలు , మంత్రులకు కూడా అప్పుడప్పుడు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు .కానీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తీరే వేరు .జనంలోకి రావడం కాదు, వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడం లో కేసీఆర్ దిట్ట. బీఆర్ఎస్ ను  గెలిపించడమే ప్రజలకు ఉన్న ఏకైక ఆప్షన్ అనే విధంగా  ప్రజల మనసులో బలమైన ముద్ర వేసి విధంగా చేయడంలోనూ కేసీఆర్ ఆరి తెరిపోయారు.

Advertisement

కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలు ఆగిపోతాయని, రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని కేసీఆర్ ప్రస్తావిస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ , కాంగ్రెస్ మధ్యనే( BRS Congress ) ప్రధాన పోటీ అనే విషయాన్ని గుర్తించారు.

దీంతో కాంగ్రెస్ ను బలహీనం చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.తాను తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తిని అన్నట్లుగా ప్రజలలోను ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.జనాలను ఆకట్టుకునే విధంగా సెంటిమెంటును రెచ్చగొట్టడంలోనూ కేసీఆర్ కు ఎవరు సాటిరారు.

 దీనిలో భాగంగానే ఏపీలో అభివృద్ధి అంశాన్ని కేసీఆర్ ( CM kcr )ప్రస్తావిస్తున్నారు.అక్కడ సమస్యలను హైలెట్ చేస్తూ తెలంగాణ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎంత ప్రగతి సాధించిందనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.తనకు మిత్రుడైన ఏపీ సీఎం జగన్ తన వ్యాఖ్యలతో ఇబ్బంది పడతారని తెలిసినా,  ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు