తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం అధికార బిఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయి.
ప్రస్తుతం గెలుపు విషయంలో మూడు పార్టీలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాయి.
ఈసారి గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బిఆర్‌ఎస్( BRS ) ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి ప్రజలు బిఆర్‌ఎస్ కు ఎంతవరుకు మద్దతిస్తారనేది ప్రశ్నార్థకమే.
ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న కేసిఆర్( CM KCR ) పాలనపై ప్రజల్లో అరకొర వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే పుంజుకున్నాయి.దాంతో బిఆర్‌ఎస్ గెలుపు అంతా సులువేమీ కాదనేది కొందరు చెబుతున్నా మాట.అయితే ఈసారి కూడా గెలుపు తమదే అని బిఆర్‌ఎస్ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు.దీనికి కారణం ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ బిఆర్‌ఎస్ కే అనుకూలంగా రావడం.
తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్( Poll Strategy Group ) నిర్వహించిన సర్వే కూడా బిఆర్‌ఎస్ కే పట్టం కట్టింది.ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కు 40.4 శాతం ఓటు బ్యాంక్ ఉండే అవకాశం ఉందట.దాదాపు 43 శాతం మంది రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసిఆరే సిఎం కావాలని కోరుకుంటున్నాట్లు ఈ సర్వే వెల్లడించింది.
ఇక కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్ది 14 శాతం, బీజేపీ తరుపున బండి సంజయ్, ఈటెల రాజేంద్ర వంటి వారని 10 శాతం మంది ప్రజలు మాత్రమే సిఎం కావాలని కోరుకుంటున్నారట.దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు బలమైన సిఎం అభ్యర్థి లేని కారణంగానే ప్రజలు మళ్ళీ కేసిఆర్ పాలనకే జై కొడుతున్నాట్లు తెలుస్తోంది.అందుకే గెలుపు విషయంలో బిఆర్‌ఎస్ మొదటి నుంచి కూడా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది.
అంతే కాకుండా ఈసారి 100 పైగా సీట్లు కైవడం చేసుకుంటామని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంది.ఇలా బిఆర్‌ఎస్ ధీమాకు కారణం.బలమైన ప్రత్యర్థి లేకపోవడమే అనేది ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.బిఆర్‌ఎస్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy