జగన్ డెసిషన్ తో అంబటికి ముప్పే ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.

ముఖ్యంగా అధికార వైసీపీలో( YCP ) ఈ మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వర్గపోరు, అంతర్గత విభేదాలు, నేతలమద్య అంతరం ఇలా చాలా అంశాలు వైసీపీని కుదేలు చేస్తున్నాయి.దీంతో సీట్ల కేటాయింపు జగన్( jagan ) కు కత్తిమీద సాములా మారింది.

ఇదిలా ఉంచితే కొంతమంది సీనియర్ నేతలకు ఈసారి సీట్లు కష్టమే అని వాదన వినిపిస్తోంది.వారిలో అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు( Anil Kumar Yadav , Ambati Rambabu ) వంటివారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Is Jagans Decision A Threat , Ycp, Jagan, Anil Kumar Yadav , Ambati Rambabu,

ముఖ్యంగా అంబటికి ఈసారి సీటు కేటాయింపు జరగడం దాదాపు ఆసాద్యమే అనే మాట పోలిటికల్ సర్కిల్స్ లో( political circles ) బలంగా వినిపిస్తోంది.పార్టీలో అత్యంత చురుకుగా ఉండే నేతలలో అంబటి ముందు వరుసలో ఉంటారు.ప్రత్యర్థి పార్టీ నేతలపై చమత్కారాలు, వ్యంగ్యస్త్రాలు సంధించడంలో అంబటి స్టైలే వేరు.

Advertisement
Is Jagan's Decision A Threat , YCP, Jagan, Anil Kumar Yadav , Ambati Rambabu,

గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజిక వర్గం ( Sattenapally Constituency )నుంచి గెలిచి ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా కొనసాగుతున్నారు.కాగా నియోజిక వర్గంలో గత కొన్నాళ్లుగా అంబటిపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుక్కుతోంది.

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన అంబటిపై ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది.దాంతో ఈసారి సత్తెనపల్లి సీటు అంబటికి కేటాయిస్తే ఓటమి తప్పదేమో అనే భయం జగన్ ను వెంటాడుతోందట.

Is Jagans Decision A Threat , Ycp, Jagan, Anil Kumar Yadav , Ambati Rambabu,

అందుకే అంబటికి బదులు ఇటీవల పార్టీలో చేరిన యర్రం వేంకటేశ్వరరెడ్డిని ( Yarram Venkateswara Reddy )బరిలోకి దించితే ఎలా ఉంటుందనే దానిపై జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్.దానికి తోడు ఈసారి సత్తెనపల్లి నియోజిక వర్గంలో టీడీపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ బరిలోకి దిగనున్నారు.బలమైన కాపు సామాజిక వర్గం కలిగిన సత్తెనపల్లిలో అంబటి పై ఉన్న వ్యతిరేకత కన్నా లక్ష్మినారాయణకు ప్లెస్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేంకటేశ్వర రెడ్డిని బరిలోకి దించితే.కాపు ఓటు బ్యాంకు చీలే అవకాశం తక్కువ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఇదే గనుక జరిగితే.అంబటికి గట్టి షాక్ తగలడం ఖాయమే.

Advertisement

మరి సత్తెనపల్లి సీటు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తాజా వార్తలు