Watermelon In Fridge : పుచ్చకాయను ఫ్రిజ్లో పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఎండ వేడికి తట్టుకోలేక చల్లని పదార్థాలను తీసుకుంటూ ఉంటారు.

కొబ్బరి బొండం, నిమ్మకాయ, కర్బూజా, బత్తాయి ఇలా చల్లబరిచే జ్యూస్ లు తాగడానికి ఇష్టపడుతుంటారు.

ఇక ఎండాకాలంలో ఒంటిని వెంటనే చల్లబరిచి డి హైడ్రేట్ కాకుండా చూసే పండ్లలో పుచ్చకాయ( Watermelon ) ముఖ్యమైనదని కచ్చితంగా చెప్పవచ్చు.పుచ్చకాయలో 95% నీరు ఉంటుంది.

అందులో పుచ్చకాయలు తింటే మంచి ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు.ఎర్రగా తీయగా ఉండే పుచ్చకాయ తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

సమ్మర్ సీజన్ లో( Summer ) రోడ్లపై ఎక్కువగా పుచ్చకాయలు అమ్ముతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పుచ్చకాయలు ఫ్రిజ్లో ఉంచవచ్చా.

Advertisement

ఉంచితే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ లో చాలామంది బయటకు వస్తే డి హైడ్రేట్ కి( Dehydrate ) గురవుతూ ఉంటారు.అందుకే సమ్మర్ లో చల్లటి పానీయాలను తీసుకుంటూ ఉంటారు.అయితే ఎండాకాలంలో పుచ్చకాయలు మంచి చల్లదనాన్ని ఇస్తాయి.

అంతేకాకుండా ఎండాకాలంలో పుచ్చకాయలు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.పుచ్చకాయలు తింటే నీటిలోపాన్ని దూరం చేసుకోవచ్చు.

ఇవి తింటే గుండె ఆరోగ్యానికి( Heart Health ) ఎంతో మంచిది.ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.పుచ్చకాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ లు ఉంటాయి.

Advertisement

ఇది శరీరంలోని వేడిని దూరం చేస్తుంది.అయితే పుచ్చకాయ ఫ్రిజ్లో పెట్టవచ్చా లేదా అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి.

పుచ్చకాయను ఎట్టి పరిస్థితులలోనూ ఫ్రిజ్ లో( Fridge ) పెట్టకూడదని పరిశోధకులు చెబుతున్నారు.పుచ్చకాయలను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు కోల్పోతుంది.పుచ్చకాయను కోసి ఫ్రిజ్లో ఉంచితే ఫుడ్ పాయిజన్( Food Poison ) అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది.అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఫ్రిజ్ లో ఒక వారం ఈ పండ్లను ఉంచితే కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది.

ఇందుకోసం 14 రోజుల పాటు పుచ్చకాయను పరిశీలించారు.ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని పుచ్చకాయ విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తాజా వార్తలు