మునుగోడు ఉపఎన్నిక అప్పుడే ఉండే అవకాశముందా...?

ఉపఎన్నికలను ఎదుర్కోవడం లో టిఆర్ఎస్ ది అందెవేసిన చేయి.తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేసి ఎక్కువ ఉప ఎన్నికలను ఎదుర్కొన్న ఘనత ఆ పార్టీకే చెందుతుంది.

కేవలం ఉపఎన్నికల తోనే తన పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి గులాబీ బాస్ కేసీఆర్.అంత చరిత్ర ఉన్న కేసీఆర్ కు మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు.

ఉపఎన్నిక ఆ నెలలోనే ఉండే అవకాశం ఉందా.తెలంగాణలో రెండు దఫాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది.

అధికారంలోకి రాకముందు అన్ని ఉపఎన్నికల్లో సత్తా చాటింది ఆ పార్టీ.ప్రస్తుతం వస్తున్న ఉపఎన్నిక ఆ పార్టీకి సవాల్ గా మారింది.

Advertisement
Is It Possible That There Will Be A Munugodu By-election..?, Munugodu, Ts Politi

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఉప ఎన్నికలు జరగగా రెండు టిఆర్ఎస్, రెండు బీజేపీ గెలిచాయి.తాజాగా మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది.

ఈ ఉపఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం తగ్గి బిజెపి అంతకంతకు పుంజుకుంటుందన్న టాక్ వినబడుతుంది.ఈ దశలో మునుగోడు సీటు గెలిచి తన ప్రాబల్యం తగ్గలేదని టిఆర్ఎస్ నిరూపించుకోవలసిన సమయం ఇది.రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలంటే మునుగోడు గెలిచి తీరక తప్పదు.ఇదివరకు ఉపఎన్నికల్లో అనుసరించిన వ్యూహాల్ని మునుగోడులో కూడా అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

Is It Possible That There Will Be A Munugodu By-election.., Munugodu, Ts Politi

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్, అనంతరం విడుదలై నోటిఫికేషన్ తో టిఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది.తనకు సంబంధంలేని సీటుగెలిస్తే ఆ పార్టీకి మంచి మైలేజీ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నాడట.తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేసే మునుగోడు ఎన్నిక ఎప్పుడు జరుగుతుందని అందరిలో చర్చ జరుగుతోంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

టిఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే మునుగోడు ఎన్నిక ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టు కనపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మునుగోడు ఎన్ని ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఆ సీటు భర్తీ చేయాల్సి ఉంటుంది.2014లో టిఆర్ఎస్ మునుగోడులో గెలిచింది.2018లో మునుగోడు కాంగ్రెస్ వశమైంది. ముందు ఆ సీటు తమదేనని ఎట్టి పరిస్థితిలో ఆ సీటు గెలుచుకొని తీరాలని టిఆర్ఎస్ భావిస్తోందట.

Advertisement

దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్న టిఆర్ఎస్.ఇటీవల జరిగిన బై ఎలక్షన్స్ ఓటమిని బేరీజు వేసుకొని మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలని టిఆర్ఎస్ పార్టీ తపిస్తుంది.

టిఆర్ఎస్ ఎలాంటి విధానాలను అవలంబిస్తుందో, ఎన్నికల్లో గెలుస్తుందా, ఓడుతుందా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు