స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఈసారి టికెట్ దక్కడం కష్టమేనా..?

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం కి( Tammineni Seetaram ) జగన్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా ?, ఈసారి ఎన్నికల్లో ఆయనకీ సీట్ దక్కడం అసాధ్యమేనా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ శ్రేణులు.2019 ఎన్నికలలో ఆముదాలవలస నుండి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నిక అయిన సీతారాం, జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ని ఆశించాడు.

కానీ జగన్ మాత్రం ఆయనకీ స్పీకర్ పదవి ని అప్పజెప్పి ఈసారికి దీనితో సరిపెట్టుకోమని అన్నాడు.

అసంతృప్తి తోనే జగన్ కి ఎదురు చెప్పలేక స్పీకర్ స్థానం లో కూర్చున్న తమ్మినేని సీతారాం కి 2024 ఎన్నికలలో ఎమ్యెల్యే టికెట్ ఇవ్వడం అసాధ్యం అని తెలుస్తుంది.జగన్ ప్రతీ నియోజకవర్గం లో కూడా సర్వేలు చేయిస్తున్నాడు.

ఈ సర్వేలలో తమ్మినేని సీతారాం ఈసారి గెలవడం అసాధ్యం అని తేలిందట.అందుకే ఆముదాలవలస నియోజకవర్గం కి వైసీపీ తరుపున కొత్త ముఖాన్ని ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట జగన్.

కానీ తమ్మినేని సీతారాం మాత్రం తనకి ఎమ్యెల్యే సీటు ని ఇవ్వాల్సిందిగా జగన్ పై ఒత్తిడి చేస్తున్నాడట.నేను ఈసారి ఎన్నికల నుండి తప్పుకుంటానని, కనీసం తన కొడుకుకి అయినా టికెట్ ఇవ్వాల్సిందిగా జగన్ ని కోరాడట.కానీ సీతారాం కుటుంబం నుండి ఎవరు పోటీ చేసిన ఓడిపోవడం మాత్రం ఖాయం అని సర్వే రిపోర్ట్స్ ఇవ్వడంతో, చేతులారా ఆ సీటు ని పోగొట్టుకునేందుకు జగన్ సిద్ధం గా లేదట.

Advertisement

అయితే తమ్మినేని సీతారాం కి జగన్ ఒక ఛాయస్ ఇచ్చాడట.పోటీ చేస్తే శ్రీకాకుళం ఎంపీ స్థానం కి పోటీ చెయ్యమని చెప్పాడట.కానీ అవతల టీడీపీ - జనసేన కూటమి నుండి శ్రీకాకుళం ఎంపీ గా రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) పోటీ చేస్తున్నాడు.

వ్యక్తిగతం రామ్మోహన్ నాయుడు చరిష్మా ముందు తమ్మినేని సీతారాం నిలబడలేదు.అంతే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం పై వ్యతిరేకత లో ఆ స్థానం నుండి గెలవడం అనేది అసాధ్యం అన్ని తమ్మినేని సీతారాం బలమైన నమ్మకం.

అందుకే ఆయన ఎంపీ సీట్ తీసుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తుంది.ఇలా జగన్ ఎటూ తేల్చకపోతే సీతారాం టీడీపీ( TDP ) లేదా జనసేన పార్టీ కండువా కప్పుకుంటాడు అనడం లో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.రాజకీయ భవిష్యత్తు ఉంటేనే ఏ నాయకుడైన పార్టీలో కొనసాగుతాడని, ఒకవేళ భవిష్యత్తు లేదు అని అర్థం అయితే మాత్రం ఆ పార్టీలో ఉండరని, తమ్మినేని సీతారాం కూడా అదే చేస్తాడని అంటున్నారు.

ఒకవేళ జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే మంత్రి పదవి ఇస్తాను అని సీతారాం కి మాట ఇస్తే మాత్రం ఆయన పార్టీ లోనే కొనసాగొచ్చు.ఏమి జరగబోతుందో చూడాలి మరి.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు