నాగుల చవితి నాడు పుట్టకు పూజలు చేస్తే పుణ్యమా ?

మనదేశంలో చాలా పండుగలను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అలాగే ఒక్కొక్క పండుగకు ఒక్కో రకమైన పూజలు కార్యక్రమాలు భక్తులు చేస్తూ ఉంటారు.

నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ చేసి విశిష్ట ఫలితాలను పొందుతూ ఉంటారు.దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా చేసుకుంటూ ఉంటారు.

ఈ పండుగ రోజున ఊరిలో, గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు.చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతూ ఉంటారు.

ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయని కచ్చితంగా నమ్ముతారు.నాగుల చవితి పండుగ రోజు నాగేంద్రునికి, శివునికి, వాసుకి గా, విష్ణువుకు, ఆదిశేషుడు ఎప్పుడూ వీరి వెంటే ఉంటాడు.

Advertisement
Is It Auspicious To Worship Putta On Nagula Chaviti ,Nagula Chaviti ,Putta , Wor

కాబట్టి ఈ నాగుల చవితి రోజు భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తితో పుట్టకు నైవేద్యాలను సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు.

Is It Auspicious To Worship Putta On Nagula Chaviti ,nagula Chaviti ,putta , Wor

ముఖ్యంగా వేద పండితులు ఏం చెబుతున్నారంటే పుట్టలో పాలు పోయకూడదు.పాముకు పాలు అరగవు కాబట్టి పుట్టలో పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రలో పాలు పోయడం మంచిది.అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేయకూడదని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సర్ప విగ్రహాలను పాలతో అభిషేకం చేసుకోవచ్చు అని చెబుతున్నారు.ఎవరైనా సర్పరాజుకి కోడిగుడ్డు సమర్పించాలనుకుంటే పుట్టలో వేయకుండా పుట్టపై భాగంలో పెడితే మంచిది.

ఇంకా చెప్పాలంటే పుట్టపై బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లడం వల్ల పుట్టను అభివృద్ధి చేసే చీమలకు అది లభించడం వల్ల పుట్ట పెరుగుతుంది.ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు