వామ్మో, ఇది పామా లేక అరటిపండా.. చూస్తే అవాక్కవుతారంతే!

ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.వీటిని చూస్తే మనం అవాక ఒక తప్పదు.

నిజానికి ప్రకృతిలో వేటికవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ మానవులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.చిన్న పక్షుల నుంచి పెద్ద జంతువుల వరకు చూసుకుంటే మనల్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఎన్నో వింత జంతువులు ఉన్నాయని అనడంలో సందేహం లేదు.

వాటిలో ఒక్కోటి బయటపడుతూ మనల్ని స్టన్ చేస్తున్నాయి.కాగా తాజాగా బాల్ పైథాన్ అని పిలిచే ఒక పాము అచ్చుగుద్దినట్లు అరటి పండు లాగానే కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.ఇది చూసిన నెటిజన్లు ఇదేం వింత అని నోరెళ్లబెడుతున్నారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో అరటిపండుకి పక్కనే బాల్ పైథాన్ పాము ఉండటం చూడవచ్చు.అయితే అరటిపండును ఈ పాము పక్కపక్కన ఉంచినప్పుడు అవి రెండు అరటి పండ్ల లాగానే కనిపించాయి.

అక్కడ ఒక పాము ఉందని పరిశీలనగా చూస్తే తప్ప అది తెలియదు.ఎందుకంటే ఆ పాము నడుము పై అరటిపండు పై పడిన మచ్చలు వలె శరీరం కనిపించింది.

అసలైన అరటిపండు మాదిరిగానే ఈ పాము తన చర్మాన్ని కలిగి ఉంది.

ఈ వీడియోను సైన్స్ అమ్మాయి ట్విట్టర్‌లో ఒక క్యాప్షన్‌తో షేర్ చేసింది.ఈ బంతి కొండచిలువ అరటిపండులా కనిపిస్తుంది.బాల్ కొండచిలువ దాని రక్షణ వ్యూహానికి ప్రసిద్ధి చెందింది.ఇది బెదిరింపులకు గురైనప్పుడు దాని తల, మెడను మధ్యలో ఉంచి బిగుతుగా ఉండే బంతిలా ముడుచుకుపోతుంది.3 లక్షల 20 వేలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో వేధించే త‌ల‌నొప్పి..ఇలా చేస్తే ప‌రార్‌!
Advertisement

తాజా వార్తలు