పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ డీలా.. కారణం ఆయనేనా?

జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలానే ఉంటోంది.

ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేదో గమనించి ఇప్పుడు బీజేపీ నేతలు అలానే చేస్తున్నారు.

గతంలో ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీకున్న తెలివి తేటలు లేదా మీకున్న వ్యూహాలు మాకు ఉంటే.ఇలా ఎందుకు.

ఉంటామంటూ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ వ్యూహాల గురించి వాజ్‌పేయి మాట్లాడింది అక్షర సత్యం.

అందుకే పార్టీ పెట్టిన వెంటనే బీజేపీ అధికారంలోకి రాలేక పోయింది.బలమైన కాంగ్రెస్ ను ఎదుర్కోలేకపోయింది.

Advertisement

కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు.గతంలో 2003, 2007 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.

ప్రధానిగా మన్మోహన్ సింగ్ వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు.కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టింది.

అప్పుడు ఎంతో బలంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీలా పడిపోయింది.ఎంతలా అంటే పార్లమెంట్‌లో బీజేపీని కనీసం ఎదుర్కొనే స్థాయిలో ఆ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు.

పిల్లలు తాగే పాలప్యాకెట్‌పై జీఎస్టీ పెంచేస్తారా? దేశ రక్షణ రంగాన్ని కాంట్రాక్టు పాలు చేస్తారా? బుల్డోజర్ విధ్వంసాలు మత విద్వేషాలు రెచ్చగొడతారా? మీ అంతు చూస్తాం.సభలోనే తేల్చుకుంటాం అంటూ తొడగొట్టిన కాంగ్రెస్.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ వలలో చిక్కి హాహాకారాలు పెడుతోంది.ఇటీవల రాష్ట్రపతిని ఎలా సంభోదించాలో తెలియక ఏకంగా విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది.

Advertisement

బీజేపీ కూడా ఇదే పెద్ద వివాదం అన్నట్టుగా పరిగణించింది.నానా రభస సృష్టించి అందులోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను లాగి ఆద్యంతం కేంద్ర మంత్రులే ప్లకార్డులు పట్టుకుని వీధి పోరాటాలకు దిగేలా వ్యూహం నడిచింది.

దీంతో కాంగ్రెస్ నేత దిగివచ్చి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.కానీ మోదీ పన్నుతున్న వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతోంది.

వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీ హవా కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

తాజా వార్తలు