హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనేనా..?

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ లలో హరీష్ శంకర్( Harish shankar ) ఒకరు.

మొదట ఈయన రవితేజ తో షాక్ అనే సినిమా తీశాడు.

ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఇక దాంతో కొద్దిరోజులపాటు పూరి జగన్నాథ్ దగ్గర రైటింగ్ అండ్ డైరెక్షన్స్ సైడ్ వర్క్ చేయడం జరిగింది.ఇక అందులో భాగంగానే ఆయన చిరుత,బుజ్జిగాడు సినిమాలకి పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ అయితే చేశాడు దాంతో మళ్ళీ ఒక మంచి కథ రాసుకొని రవితేజ తో మిరపకాయ అనే సినిమా తీశాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది.ఈ సినిమా కూడా బాక్సాస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో హరీష్ శంకర్ ( Harish shankar )ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి.ఇక ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇప్పటికే 50% పైన షూటింగ్ పూర్తిచేసుకుంది.అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద ఇంకా క్లారిటీ రావడం లేదు.

Advertisement

సినిమా పూర్తి అయితే హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే యూత్ ఫుల్ హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ), వరుణ్ తేజ్ లతో వరుసగా మంచి సినిమాలను చేశారు.ఇక అదే కోవలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తో కూడా ఒక మంచి యూత్ ఫుల్ సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి హరిష్ శంకర్ మంచి డైరెక్టర్ కమర్షియల్ సినిమాలని ఎలా తీసి హిట్టు కొట్టాలి అనేది ఆయనకు తెలిసినంత బాగా ఇంకా ఎవరికి తెలియదు.

అందుకే ఆయన కమర్షియల్ సినిమాలను ఎక్కువగా నమ్ముకొని సినిమాలు తీస్తూ ఉంటాడు.ఈ ఉస్తాద్ భగత్ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తో చేసే సినిమా స్టార్ట్ అవుతున్నట్టు గా తెలుస్తుంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు