ఫ్యూచర్ ఫ్యూయల్ ఇక అదేనా? దాంతో సమస్య పూర్తిగా తీరుతుందా?

భూమి గ్లోబల్ వార్మింగ్ తో రోజురోజుకీ వేడెక్కిపోతుంది.దాంతో భూమిపై పెట్రోల్, డీజిల్ వంటి ఆయిల్ రిసోర్సులు తగ్గిపోతున్నాయి.

ఈ సమస్య తీరేదెలా అని ఆలోచించినప్పుడు అందరి మదిలో మెదిలేది గ్రీన్ హైడ్రోజన్.చాలాదేశాలు పెట్రోల్, డీజిల్కు ఆల్టర్నేట్గా వాడేందుకు ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్( Green hydrogen ) ఫ్యూయెల్ను డెవలప్ చేయడం మొదలు పెట్టాయి.

పెట్రోల్, డీజిల్తో పోలిస్తే దీనికయ్యే ఖర్చు చాలా తక్కువే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.అందుకే చాలా దేశాలతో పాటు ఇండియా కూడా గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులేస్తోంది.

ఇప్పటికే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది మొదలైందనే విషయం తెలిసినదే.రాబోయే రోజుల్లో హైడ్రోజన్ హబ్గా ( hydrogen hub )ఎదిగే దిశగా ఇండియా చర్యలు తీసుకుంటోంది.నేటి క్లైమేట్ చేంజ్కు గ్లోబల్ వార్మింగ్ కారణం.

Advertisement

అలాంటి సందర్భాలలో కార్బన్ డై ఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలో పేరుకుపోతాయి.అయితే, ఇప్పుడీ సమస్యలకు గ్రీన్ హైడ్రోజన్ అత్యుత్తమ పరిష్కారం అంటున్నారు సైంటిస్టులు.

జీరో పొల్యూషన్తో భూగోళానికి ఊరటనిచ్చే గ్రీన్ హైడ్రోజనే ఫ్యూయెల్ ఆఫ్ ది ఫ్యూచర్ ( Fuel of the Future ) అని స్పష్టం చేస్తున్నారు.

ఇపుడు శిలాజ ఇంధనాలకు సోలార్, విండ్ పవర్ల కంటే గ్రీన్ హైడ్రోజనే అత్యుత్తమ ప్రత్యామ్నాయం కానుంది.హైడ్రోజన్ విరివిగా దొరికే రసాయన మూలకం అనే విషయం అందరికీ తెలిసినదే.భూమిపై దాదాపు 75% హైడ్రోజన్ ఉంటుంది.

కానీ, ఇది ఆక్సిజన్, కార్బన్ వంటి మూలకాలతో సమ్మేళితమై ఉంటుంది.ఆక్సిజన్తో కలిస్తే నీటి అణువులుగా మారుతుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

కార్బన్తో కలిస్తే సేంద్రియ పదార్థంగా మారుతుంది.ఇలా ఇతర మూలకాలతో కలిసిపోతూ ఉండటం వల్ల దీనిని నేరుగా సేకరించడం మాత్రం సాధ్యం కాదు.

Advertisement

హైడ్రోజన్ను ఎప్పటి నుంచో కెమికల్, స్టీల్ ఇండస్ట్రీల్లో ముడి పదార్థంగా, ఇంధనంగా వాడుతున్నారు.అయితే, దీన్ని నేరుగా ప్రకృతి నుంచి తీసుకోలేం కాబట్టి కృత్రిమంగా తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు