ఎండు చేప‌లు తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..?

చాలా మంది ఇష్ట‌ప‌డే నాన్‌-వెజ్ ఐటెమ్స్ లో ఎండు చేప‌లు( Dry fish ) కూడా ఒక‌టి.ఎండు చేప‌ల‌ను ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో వండుకుని తింటుంటారు.

చేప‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.అయితే మ‌రి ఎండు చేప‌లు తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే వైద్యుల నుంచి అవున‌న్న స‌మాధాన‌మే వినిపిస్తోంది.ఎండు చేప‌ల్లో కాల్షియం, ఐర‌న్‌, ఫాస్ఫరస్( Calcium, Iron, Phosphorus ) వంటి మిన‌ర‌ల్స్ మెండుగా ఉంటాయి.

కాల్షియం ఎముకల బలానికి సహాయపడుతుంది.ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెడుతుంది.

ఫాస్ప‌ర‌స్ శరీర కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ( Omega-3 fatty acids )అధికంగా ఉండడం వల్ల ఎండు చేప‌లు గుండె ఆరోగ్యానికి మ‌ద్ద‌తు ఇస్తాయి.

Advertisement

హృదయ సంబంధిత సమస్యలు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తాయి.మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలను కూడా ఎండు చేప‌లు కలిగి ఉంటాయి.

శరీర కణాల అభివృద్ధి, కండరాల బలానికి సహాయపడే హై ప్రోటీన్ ఎండు చేప‌ల్లో ఉంటుంది.అందువ‌ల్ల పెద్ద‌లే కాకుండా ఎదుగుతున్న పిల్ల‌ల‌కు కూడా ఎండు చేప‌లు పెట్టొచ్చు.ఎండు చేపల్లో జింక్, సెలీనియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో తోడ్ప‌డ‌తాయి.

ఎండు చేపల్లో ఉండే విటమిన్ ఇ( Vitamin E ) చ‌ర్మానికి మృదుత్వాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.వయస్సు పెరిగే ప్రక్రియను నెమ్మదింప‌జేస్తుంది.ఎండు చేపలు ఆరోగ్యానికి మంచి పోషకాహారం.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

గుండె, మెదడు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.కానీ ఎండు చేప‌ల్లో అధిక ఉప్పు ఉంటుంది.

Advertisement

అందువ‌ల్ల హైబీపీ ఉన్న వారు ఎండు చేప‌ల‌ను ఎవైడ్ చేయాలి.అలాగే ఎండు చేప‌ల‌ను అతిగా తింటే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఒక‌వేళ ఇప్ప‌టికే హై కొలెస్ట్రాల్ తో బాధ‌ప‌డుతుంటే.వారు కూడా ఎండు చేప‌ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

ఇక ఆరోగ్యకరంగా వండుకుని మితంగా తింటే ఎండు చేప‌లు రుచికరమైన మ‌రియు పోషకవంతమైన ఆహారంగా మారుతుంది.

తాజా వార్తలు