" డీకే " ట్విస్ట్ లు.. కాంగ్రెస్ తిప్పలు !

కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్( Congress ) లో నెలకొన్న అనిశ్చితి ఇంతట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు.

సి‌ఎం గా భాద్యతలు చేపట్టిన వ్యక్తి ఈ నెల 18న ప్రమాణం స్వీకారం చేయనుండగా.ఇంతవరకు సి‌ఎం ఎవరో తేల్చుకోలేని పరిస్థితి.

కాంగ్రెస్ లో సి‌ఎం అభ్యర్థిగా మొదటినుంచి కూడా మాజీ సి‌ఎం సిద్దిరామయ్య( Siddaramaiah ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ప్రజా మద్దతు కూడా సిద్దిరామయ్య కే ఎక్కువగా ఉండడంతో ఆయననే సి‌ఎం గా ఎన్నుకుంటారని భావించరంతా.

అయితే ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు తానకు సి‌ఎం‌ పదవి కావాలని మొండి పట్టు పట్టడంతో కథ అద్దం తిరిగింది.పార్టీ గెలుపుకు తాను చాలా కష్టపడ్డానని, తాను మాత్రమే సి‌ఎం పదవికి అర్హుడను అంటూ డీకే శివకుమార్ ( D.K.Shivakumar )పోలిటికల్ హీట్ పెంచారు.దాంతో ఎవరిని సి‌ఎం గా ఎన్నుకోవాలనేది కాంగ్రెస్ కు పెద్ద చిక్కుముడిగా మారింది.

Advertisement

అయితే అధిష్టానం కూడా సిద్దిరామయ్య వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో డీకే ఇచ్చిన ట్విస్ట్ తో హైకమాండ్ కూడా డైలమాలో పడిందట.తన వల్ల పార్టీలో చీలిక రాకూడదని, 135 కుటుంబ సభ్యులు కలిగిన తన కుటుంబం ( కాంగ్రెస్ ) ను విడదీయాలనుకోవడం లేదని డీకే శివకుమార్ స్వీట్ హెచ్చరికలు ఇస్తున్నారు.

తాను బ్లాక్ మెయిల్ చేయడం లేదని చెబుతూనే ఇన్ డైరెక్ట్ గా తనకు సి‌ఎం పదవి ఇవ్వకపోతే ఏం జరుగుతుందనేది చెప్పకనే చెబుతున్నారు డీకే శివకుమార్.ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే సిద్దిరమయ్యకు సి‌ఎం పదవి కట్టబెడితే డీకే శివకుమార్ పార్టీలో చీలిక తెచ్చేందుకు సిద్దమౌతున్నారా అనే సందేహాలు రాక మానవు.దీంతో కర్నాటక సి‌ఎం పదవి ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

కాగా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో సిద్దిరామయ్య బేటీ అయ్యారు.ఇక నిన్ననే డిల్లీ వెల్లసిన డీకే శివకుమార్ నేడు బయలుదేరుతున్నారు.మరి డిల్లీ పెద్దలు ఈ ఇద్దరి నేతలకు ఎలాంటి సూచనలు ఇస్తారు ? ఎవరికి పదవి కట్టబెడతారు ? ఎవరిని బుజ్జగిస్తారు ? అనే అంశాలు హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.మరి ఎవరు సి‌ఎం అవుతారో చూడాలి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు