చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఒక క్లారిటీ వచ్చేశారు.

ప్రస్తుతం కొనసాగిస్తున్న పొత్తు ను ముందు ముందు కొనసాగించాలని డిసైడ్ అయిపోయారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలైన,  జమలి ఎన్నికలు అయినా,  పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.టిడిపి , జనసేన , బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి గా ఎన్నికలకు వెళ్తే తిరుగే ఉండదనే లెక్కల్లో చంద్రబాబు ఉన్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేస్తున్నారు.మిత్ర పక్షాలకు కేటాయించిన నియోజకవర్గంలోనూ టిడిపి బలపడే విధంగా అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ప్లాన్ లు వేసుకుంటున్నారు.  నియోజకవర్గాల పునర్విభజన  జరిగితే 225 నియోజకవర్గాలుగా ఏపీ అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది .దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Is Chandrababu Clear And Thats Why He Gave That Statement, Tdp, Janasena, Ysrcp
Advertisement
Is Chandrababu Clear And That's Why He Gave That Statement, TDP, Janasena, Ysrcp

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించే విధంగా చంద్రబాబు( Chandrababu ) ప్లాన్ చేస్తున్నారు.పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని వదులుకోమని సంకేతాలను ఇస్తున్నారు.యువతరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

సీనియర్లను పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నేతలకు అనేక విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు .ఎన్నికలు ఎప్పుడు జరిగినా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పదేపదే చెబుతున్నారు.  జమిలి ఎన్నికలు జరిగినా,  2029లో సాధారణ ఎన్నికలు జరిగినా టిడిపి ,జనసేన , బిజెపి కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు.

ఈ విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు.

Is Chandrababu Clear And Thats Why He Gave That Statement, Tdp, Janasena, Ysrcp

 కూటమి తోనే ఎన్నికల్లో పోటీ చేయాలని , ఈ విషయంలో పార్టీ నేతలు ఎవరు వ్యతిరేకించే అవకాశం లేకపోయినా ,ముందుగానే ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు.మరోసారి ఏపీలో జగన్ అధికారంలోకి రాకుండా చేయాలంటే కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్టుగా అర్థం అవుతుంది.విడివిడిగా పోటీ చేస్తే మళ్లీ వైసీపీకి ( YCP )ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని,  అందుకే టిడిపి, జనసేన ను కలుపుకుని ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అవ్వాలనే అభిప్రాయంతో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటూ వాటిని ప్రకటిస్తున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు