కేసీఆర్ కు మరో షాక్ ఖాయమేనా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుండడం, టీఆర్ఎస్- బీజేపీ మధ్య రోజూమాటల యుద్దం నడుస్తుండడంతో తెలంగాణలో రాజకీయవేడి రాజుకుంది.

తెలంగాణలో త్వరలో కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆయా కార్పొరేషన్లలో విజయం సాధించడానికి గెలుపు వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే బీజేపీ ఆయా కార్పొరేషన్ల పరిధిలోని భారతీయ జనతాపార్టీ కార్యకర్తలతో సమావేశమై క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎలా ఉందనే విషయాలపై ఒక అంచనాకు వస్తున్నారు.

Is Another Shock For Kcr,bjp, Bandi Sanjay, Kcr , Corporation Elections, Telang

అందుకనుగుణంగా నోటిఫికేషన్ విడుదల అవగానే తమ వ్యూహాన్ని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వైఫ్యల్యాలనే తమ ప్రచారస్త్రాలుగా మలుచుకుంటున్న బీజేపీ ఈ ఎన్నికలలో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది.అయితే బీజేపీ వ్యూహం ఈ ఎన్నికల్లో కూడా ఫలిస్తే కేసీఆర్ కు మరో సారి షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా బీజేపీ-టీఆర్ ఎస్ మధ్యనే విపరీతమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Advertisement
Is Another Shock For KCR,bjp, Bandi Sanjay, Kcr , Corporation Elections, Telang

తాజా వార్తలు