వీడియో వైరల్: ధోనినా మజాకా.. మరోమారు మెరుపువేగంతో స్టంపింగ్

​ఆదివారం నాడు చెన్నైలోని ఎం.ఏ.

చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ( CSK ) ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై( MI ) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

​ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేశారు.సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు (4 ఓవర్లలో 18 పరుగులు), ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.​156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే, రాహుల్ త్రిపాఠిని తొందరగా కోల్పోయినా, రుతురాజ్ గైక్వాడ్ (53 పరుగులు) మరియు రచిన్ రవీంద్ర (65 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు.ముంబై బౌలర్లలో డెబ్యుటెంట్ విఘ్నేష్ పుత్తూర్ 3 వికెట్లు తీశాడు.​

ఈ విజయంతో సీఎస్‌కే తమ ఐపీఎల్ 2025( IPL 2025 ) సీజన్‌ను విజయవంతంగా ఆరంభించింది.మరోవైపు, ముంబై ఇండియన్స్ 2012 నుండి తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి చెందుతున్న అనవసర రికార్డును కొనసాగించింది.​ మ్యాచ్‌లో నూర్ అహ్మద్ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.

Advertisement

ఇక ముఖ్యంగా 43 ఏళ్ల ధోనీ( Dhoni ) తన మెరుపు స్టంపింగ్‌తో( Stumping ) మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించాడు.స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు, టీవీ ముందు ఉన్న అభిమానులకు వింటేజ్ ధోనీ మళ్లీ గుర్తుకు వచ్చాడు.

మ్యాచ్ 11వ ఓవర్‌లో ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్( Surya Kumar Yadav ) క్రీజులో ఉన్న సమయంలో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ ఓ స్పెషల్ డెలివరీ అందించాడు.11వ ఓవర్ మూడో బంతిని గూగ్లీగా వేయగా, సూర్యకుమార్ దాన్ని అంచనా వేయలేకపోయాడు.భారీ షాట్ కోసం ముందుకు రావడంతో క్షణాల్లోనే తన బ్యాలెన్స్ కోల్పోయాడు.

ఈ సందర్భాన్ని వదులుకోకుండా ధోనీ తన సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌ స్కిల్స్‌ను చూపించాడు.కేవలం 0.12 సెకన్ల వ్యవధిలోనే అతడు వికెట్లను గిరాటేసి బెయిల్స్‌ను పడగొట్టాడు.అది అంత వేగంగా జరిగింది కనుక, సూర్యకుమార్ అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తన క్రీజు వెనక్కి చేరేలోపే ధోనీ మ్యాజిక్ పని చేసేసింది.ప్రశుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

న్యూస్ రౌండర్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు