Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Shiva Balakrishna ) కేసులో ఏసీబీ( ACB ) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగానే శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

కాగా శివబాలకృష్ణకు బినామీలుగా భరత్, భరణి, సత్యనారాయణ ఉండగా వారికి అధికారులు నోటీసులు అందజేశారు.

అదేవిధంగా శివ బాలకృష్ణ ఆస్తుల( Shiva Balakrishna Assets ) లావాదేవీలు నిలిపివేయాలని ఏసీబీ కలెక్టర్ కు లేఖ రాసింది.ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టింది.ఏసీబీ అధికారుల కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు సిద్ధమైంది.

ప్రభుత్వ అనుమతితో ఏసీబీ చర్యలు తీసుకోనుంది.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు