People Media Factory: ఒక్కో ఇటుక పేర్చుకుంటూ దుర్బేధ్యమైన కోట కడుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ పేరు చెప్పగానే ఎక్కడో విన్నట్టుగా ఉందే అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే సంస్థ ఒక నాలుగు ఐదేళ్ల క్రితం మొదలయ్యింది.

డామ్, డిం అంటూ ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేవు.కానీ ఈ ఐదేళ్ల తమ్మ షార్ట్ జర్నీ లో యువ హీరోలను టార్గెట్ చేసి మంచి సినిమాలతో మార్కెట్ లోకి వచ్చారు.

నిఖిల్, నాగ శౌర్య, శర్వానంద్, అడవి శేష్, రవి తేజ వంటి హీరోలతో సినిమాలు తీశారు.పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థతో అసోసియేట్ అయ్యి ఏకంగా 15 సినిమాను నిర్మించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

ఇందులో కొన్ని హై బడ్జెట్ మూవీస్ కాగా, మరో కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాలు అని తెలుస్తుంది.శర్వానంద్ 33 వ సినిమాను కూడా వీరే నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక రవి తేజ చిత్రం ధమాకా కు కూడా వీరే నిర్మాతలు.శ్రీ విష్ణు తో సైతం ఒక సినిమా షూట్ నడుస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే వీరి సినిమాలకు అంతే లేదు.అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపున కేవలం సినిమాలు మాత్రమే కాదు.

మూడు వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి.అలాగే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ స్టూడియో అవసరం అని భావించి తమ సొంతంగా ఒక స్టూడియో సైతం నిర్మాణం చేతున్నారు.

మెరా, ఎక్విప్‌మెంటు రెంటల్సు, క్రియేటివ్ బ్యాంకు, పోస్ట్ ప్రొడక్షన్, వర్చువల్ స్టూడియో అంటూ సినిమా కు సంబంధించి అన్ని విభాగాల్లో వీరు తమ సర్వీసెస్ ని అందిస్తున్నారు.వీరి ఎదుగుదల చూస్తుంటే యష్‌రాజ్ క్రియేషన్స్, ధర్మా ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు గుర్తస్థాయి.ఈ సంస్థలు కూడా అంచెలంచెలుగా తమ ఎదుగుదలను ఏర్పరుచుకున్నారు.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..

నిజం చెప్పాలంటే వీరికి ఇండస్ట్రీ లో పెద్దగా ఎవరి అందండలు లేవు.

Advertisement

ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వారికంటూ సొంత దుర్భేద్యమైన కోటను కడుతున్నారు.ఇక ఈ సంస్థలో విశ్వప్రసాద్ గారు వివేక్ కూచిభొట్ల వంటి వారిని కలుపుకొని అనేక బృహత్ ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు.వి ఎన్ ఆదిత్య లాంటి దర్శకుడు వీరికి అండగా ఉన్నారు.

సమీప భవిష్యత్తు లో ఈ పేరు బాగా వినిపించబోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు