రాజాసింగ్ హనుమాన్ శోభాయాత్రకు అంతరాయం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హనుమాన్ శోభాయాత్రకు అంతరాయం ఏర్పడింది.హైదరాబాద్ ధూల్ పేట గల్లీలో శోభాయాత్ర వాహనం ఇరుక్కుపోయింది.

చిన్న చిన్న గల్లీలు కావడంతో ఎక్కడికక్కడ శోభాయాత్ర వాహనాలు నిలిచిపోతున్నాయి.శోభాయాత్ర రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Interruption Of Rajasingh Hanuman Shobhayatra-రాజాసింగ్ హన

కాగా శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు.మరోవైపు సీతారాంబాగ్ నుంచి వీహెచ్పీ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతోంది.

ఈ క్రమంలో మంగళ్ హాట్ చౌరస్తాలో రెండు శోభాయాత్రలు కలుసుకోనున్నాయి.కాగా శ్రీరాముని శోభాయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది.

Advertisement

హిందూ రాష్ట్రం కోసం ఛత్రి చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయిస్తానని రాజాసింగ్ చెబుతున్నారు.అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఛత్రి చౌరస్తాకు గుర్తింపు ఉంది.

దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు