కనిపించని సుదీక్ష జాడ.. రంగంలోకి ఇంటర్‌ పోల్, యెల్లో నోటీసు జారీ

విహారయాత్ర కోసం కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్‌కి (Caribbean country Dominican Republic)వెళ్లిన భారత సంతతికి చెందిన సుదీక్ష కోణంకి (20)(Sudiksha Konanki ) అదృశ్యమైన సంగతి తెలిసిందే.

రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆమె ఆచూకీ తెలియరాలేదు.

సుదీక్ష సముద్రంలో గల్లంతై ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.డ్రోన్లు, నిఘా విమానాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

సుదీక్ష చివరిసారిగా ధరించిన దుస్తులు బీచ్ సమీపంలో దొరకడం కలకలం రేపుతోంది.తాజాగా సుదీక్ష(Sudiksha) కేసులో ఇంటర్‌పోల్ రంగంలోకి దిగింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేస్తూ యెల్లో నోటీసులను జారీ చేసింది.తప్పిపోయిన వ్యక్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పోలీస్ హెచ్చరికను యెల్లో నోటీసు అంటారు.

Advertisement
Interpol Issues Yellow Notice For Indian Origin Student Sudiksha Konanki Missing

తల్లిదండ్రుల అపహరణ, నేరపూరిత కిడ్నాప్‌లు , వివరించలేదని అదృశ్యాల కోసం దీనిని జారీ చేస్తారు.యెల్లో నోటీసు అనేది చట్ట అమలుకు ఒక విలువైన సాధనం.

ఇది తప్పిపోయిన వ్యక్తిని గుర్తించే అవకాశాలను పెంచుతుంది.ప్రత్యేకించి ఆ వ్యక్తి విదేశాలకు ప్రయాణించే లేదా తరలించబడే అవకాశం ఈ నోటీసు కీలకంగా మారుతుంది.

Interpol Issues Yellow Notice For Indian Origin Student Sudiksha Konanki Missing

పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ విద్యార్ధిని (University of Pittsburgh student)అయిన సుదీక్ష కోణంకి మార్చి 6న డొమినికన్ రిపబ్లికన్‌లోని లా అల్ట్రాగ్రాసియా ప్రావిన్స్‌లోని పుంటా కానాలోని ఒక బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా అదృశ్యమైంది.ఇంటర్‌పోల్ నోటీస్ ప్రకారం కోణంకి 1.6 మీటర్ల పొడవు, ఆమె కుడి చెవిపై మూడు కుట్లు ఉన్నాయి.ఈ నోటీసును సరిహద్దు అధికారులకు ఫ్లాగ్ చేస్తారు.

దీని వలన ప్రయాణం కష్టమవుతుంది.సుదీక్ష కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టిన డొమినికన్ పోలీసులతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జత కలిసింది.

Interpol Issues Yellow Notice For Indian Origin Student Sudiksha Konanki Missing
ఇది కదా టూరిజం అంటే.. డానిష్ టూరిస్టులను చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
గడ్డకట్టే నీళ్లలో 9 రోజులు ఆగకుండా ఈతకొట్టిన ఎలుగుబంటి.. ఎన్ని కి.మీ ప్రయాణించిందంటే..?

సుదీక్ష అదృశ్యమైన సమయంలో రిపబ్లికా హోటల్‌లో విద్యుత్‌కి అంతరాయం ఏర్పడటంతో , అనేక మంది అతిథులు బీచ్‌కు వెళ్లాల్సి వచ్చిందని హోటల్ అధికారులు తెలిపారు.కోణంకి కనిపించకుండా పోవడానికి ముందు ఆమెతో చివరిసారిగా ఉన్న వ్యక్తులను తిరిగి విచారిస్తున్నట్లు డొమినికన్ పోలీసులు తెలిపారు.ద్వీపం తూర్పు తీరంలోని జలాల్లో శోధించడానికి అధికారులు డ్రోన్లు, హెలికాఫ్టర్లు, డిటెక్షన్ డాగ్‌లను(Drones, helicopters, detection dogs) ఉపయోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు