రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. ఎంపీలకు చంద్రబాబు కర్తవ్య బోధ..!!

ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు( Chandrababu) సమావేశం అయ్యారు.

అందుబాటులో లేని ఇతర నేతలు జూమ్ ద్వారా భేటీలో పాల్గొన్నారు.

ముందుగా ఎన్నికల్లో గెలుపొందిన నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రంలో మంత్రివర్గ కూర్పు అంశంతో పాటు టీడీపీకి( TDP) ఉన్న ప్రాధాన్యం వంటి తదితర విషయాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు.

ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలకు చంద్రబాబు కర్తవ్యాన్ని బోధించారు.ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సమాజ సేవ చేయాలని నేతలకు సూచించారు.రాష్ట్ర ప్రయోజనాలే అందరి ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

Advertisement

అదేవిధంగా పార్లమెంట్( Parliament ) లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించ వద్దని సూచించారు.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు