మెస్మరైజ్ చేసిన షేడ్స్ ఆఫ్ సాహో2! ఫ్యాన్స్ కి ఫుల్ బొనంజా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ వన్ మేకింగ్ వీడియోతో సినిమా మీద కావాల్సినంత హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు తాజాగా శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.ఊహించినట్లుగానే ఈ వీడియో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తోనే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

పూర్తిగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో షూట్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా వున్నాయి.ప్రభాస్ విలన్స్ మధ్య జరిగే యాక్షన్ ని ఈ మేకింగ్ వీడియోలో ప్రెజెంట్ చేసారు.

అలాగే ఇందులో శ్రద్ధాకపూర్ ని కూడా చాలా పవర్ ఫుల్ గా పోలీస్ కాప్ గా హీరోయిక్ లుక్స్ తో రివీల్ చేయడం ద్వారా ఇందులో ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఎనర్జిటిక్ గాఉండబోతుంది అని తెలుస్తుంది.అలాగే ఇంది కచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో యాక్షన్ థ్రిల్లర్ గా యంగ్ రెబల్ స్టార్ కెరియర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచిపోయి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గారంటీ అనిపిస్తుంది.

Advertisement
మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్

తాజా వార్తలు