'ఎన్టీఆర్30' నుండి బిగ్ అప్డేట్.. రేపటి కోసం అంతా వెయిటింగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఎన్టీఆర్30.

ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.త్రిపుల్ ఆర్ సినిమాతో భారీ స్టార్ డమ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో ఫిక్స్ చేసాడు.

ఈ సినిమా ప్రకటించి ఏడాదికి పైగానే అవుతున్న ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.ఇప్పటికీ ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు.

Advertisement

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.మరి మేకర్స్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారని సమాచారం బయటకు వచ్చింది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఈ సినిమా నుండి జాన్వీ కపూర్ గురించి అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే జాన్వీ కపూర్ మార్చి 6న పుట్టిన రోజు జరుపు కోనుంది.ఈ క్రమంలోనే ఈమె బర్త్ డే రోజు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందట.

ఈ సినిమా నుండి హీరోయిన్ గా ఈమె ఫిక్స్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది.ఇక పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీగా స్థాయిలో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు