ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న సలార్ వార్త

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ( prabhas )నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ నెలలో సినిమా ను విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు.

ప్రభాస్ షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అయింది.ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణం గా విదేశాలకు ప్రభాస్ వెళ్లాడు ప్రభాస్ ఇండియా లో లేని సమయంలో సలార్‌( salaar movie ) కి సంబంధించిన షూటింగ్‌ ను దాదాపుగా రెండు వారాల పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేశాడు అంటున్నారు.

అది కొన్ని సన్నివేశాలకు రీ షూట్‌ అంటున్నారు.ప్రభాస్‌ ఉన్న సన్నివేశాలను కూడా రీ షూట్‌ చేశారట.

Advertisement
Interesting Rumors About Prabhas Prashanth Neel Salaar Movie , Prabhas , Pra

అయితే ఆ సన్నివేశాల్లో ప్రభాస్ డూప్‌ ని ఉపయోగించారు అంటున్నారు.

Interesting Rumors About Prabhas Prashanth Neel Salaar Movie , Prabhas , Pra

రీ షూట్‌ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్‌ యొక్క సినిమా లు బ్యాక్‌ టు బ్యాక్‌ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్‌ నుంచి ఏ ఒక్క మంచి సినిమా రాలేదు.

దాంతో ప్రభాస్‌ సినిమా ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అనుకుంటున్న సమయంలో సలార్ ను ప్రకటించారు.సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో రీ షూట్‌ అంటే భయంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Interesting Rumors About Prabhas Prashanth Neel Salaar Movie , Prabhas , Pra
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కేజీఎఫ్ సినిమా విషయం లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టెన్షన్ లేకుండా కనిపించాడట.కానీ ఈ సినిమా కి కాస్త టెన్షన్‌ పడుతున్నాడని, అంతే కాకుండా రీ షూట్స్ మీద రీ షూట్స్ చేస్తున్నాడని అంటున్నారు.కాస్త ఫలితం తేడా కొడితే కచ్చితంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ( prashanth neel )కు నెగటివ్ ట్రోల్స్ గట్టిగా పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు