Sri Erukumamba Temple : అక్కడ అమ్మవారికి శిరస్సు ఉండదు.. పసుపు నీళ్లు పోస్తే కోరిన కోరికలు తీరతాయట.. ఎక్కడంటే?

సాధారణంగా ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్లినా అమ్మవారి పూర్తి రూపం ఉంటుందనే సంగతి తెలిసిందే.

అయితే ఒక ఆలయంలో మాత్రం అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది.

ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు స్థానంలో ఓంకారం( Omkaram ) ఉంటుంది.విశాఖపట్నంలోని( Vishakapatnam ) దొండపర్తిలో ఈ ఆలయం ఉండగా ఇక్కడ వెలసిన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారిని( Sri Erukumamba Ammavaru ) భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ఇక్కడి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు బలంగా నమ్ముతారు.మూడు బిందెలతో పసుపు నీళ్లు( Turmeric Water ) పోయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని భక్తులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.

Advertisement

ఈ ఆలయంలో అమ్మవారిని గౌరీ స్వరూపం అని భావిస్తారు.ఇక్కడ అమ్మవారు కలలో కనిపించి భక్తులకు తనకు శిరస్సు లేకుండా పూజలు చేయాలని సూచించడం గమనార్హం.కలియుగంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే దేవతలలో శ్రీ ఎరుకుమాంబ దేవత ఒకరని భక్తులు ఫీలవుతారు.

పెళ్లి కాని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే త్వరగా వ్యాధులు నయమవుతాయి.

ప్రతి బుధవారం రోజున ఈ ఆలయంలో స్నాన ఘట్టాల పూజను గ్రాండ్ గా నిర్వహిస్తారు.ప్రతి నెలా మూడో గురువారం రోజున ఈ ఆలయం దగ్గర అన్నదానం నిర్వహిస్తారని సమాచారం అందుతోంది.బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించునే అవకాశం ఉంటుంది.

ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.అక్కయ్యపాలెంకు సమీపంలో ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకునే అవకాశం ఉంటుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

ఒకప్పుడు ఈ ఆలయం వేరేచోట ఉండేదని రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఈ ఆలయం మారిందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు