Actress Pragathi : ఆ చూపుల వల్ల ఎంతో బాధ పడ్డానని చెప్పిన ప్రగతి.. ఆర్థిక కష్టాలు అని చెబుతూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి( Actress Pragathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రగతి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సీరియల్స్ లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఒక సరికొత్త ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధంగా ఉంది.ఈమె తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయంలో, జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇక తనపై నెగటివ్ కామెంట్ చేసే వారికి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది ప్రగతి.

ఇటివలె ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన కెరియర్ లో జరిగిన చాలా విషయాల గురించి వెల్లడించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మాది హైదరాబాద్‌.పదో తరగతి వరకూ ఇక్కడే ఉన్నాం.

ఆ తర్వాత చెన్నైకు( Chennai ) షిఫ్ట్‌ అయ్యాం.చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను.

దాంతో అమ్మా నేనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము.ఆర్థికంగా అమ్మకు సాయం చేయడం కోసం కాలేజీ రోజుల్లో కొంతకాలం పాటు కార్టూన్‌ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను.

చెన్నైలోని మైసూర్‌ స్కిల్‌ ప్యాలెస్‌ షోరూమ్‌ ( Mysore Skill Palace Showroom )కోసం మోడల్‌ గానూ వర్క్‌ చేశాను.అయితే మోడల్‌గా వర్క్‌ చేసిన రోజుల్లో తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా వద్దకు వెళ్లాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆడిషన్స్‌ అనంతరం ఆయన తన సినిమాలోకి నన్ను సెలెక్ట్‌ చేశారు.సహాయ నటి పాత్ర కోసం నన్ను ఎంచుకున్నారనుకుని ఓకే చెప్పాను.

Advertisement

కానీ తీరా చూస్తే ఆ సినిమాలో హీరోయిన్‌ గా నన్ను తీసుకున్నట్లు చెప్పారు.ఆయన మాటకు షాకయ్యాను.మా అమ్మ ధైర్యం చెప్పడంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశాను.

అలా, భాగ్యరాజా తెరకెక్కించిన వీట్టులే విశేషం నా తొలి చిత్రం.అదే చిత్రం గౌరమ్మా నీ మొగుడెవరమ్మా అనే పేరుతో తెలుగులో విడుదలైంది.

హీరోయిన్‌గా నేను దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించాను.హీరోయిన్‌గా రాణిస్తోన్న రోజుల్లోనే నాకొక ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

నేను హీరోయిన్‌గా నటించిన ఒక చిత్రానికి హీరోగా వర్క్‌ చేసిన వ్యక్తే నిర్మాతగానూ వ్యవహరించాడు.సినిమాలోని వాన పాట కాస్ట్యూమ్‌ విషయంలో ఆ టీమ్‌తో నాకు గొడవ జరిగింది.

కోపంతో నేను సెట్‌ నుంచి వెళ్లిపోయాను.చివరకు రాజీ పడి పెండింగ్‌ షూట్‌ పూర్తి చేశాను.

ఆ సమయంలో సెట్‌లో వాళ్ల చూపులు నన్నెంతో బాధించాయి.ఆ సమయంలో ఇకపై సినిమాలు చేయకూడదని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పుకొచ్చింది ప్రగతి.

తాజా వార్తలు