'గేమ్ ఛేంజర్' సాంగ్ పోస్టర్ లో ఇది గమనించారా.. శంకర్ అలా హింట్ ఇచ్చాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్( Game Changer ) ఒకటి.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న చరణ్ తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం తన 15వ సినిమాగా చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.కానీ ఎలాంటి అప్డేట్స్ శంకర్( Director Shankar ) ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.

అయితే ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గురించి ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చారు.ఫస్ట్ సింగిల్ వస్తుంది అనుకుంటే కేవలం ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

Advertisement

అయితే ఇదైనా ఇచ్చారు సంతోషం అనే వారు కూడా లేకపోలేదు.ఏది ఏమైనా ఫస్ట్ సింగిల్ ను ఈ దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.ఆ విషయాన్నీ ఒక గ్రాండ్ పోస్టర్ తో తెలిపారు.

ఈ పోస్టర్ తో సాంగ్( Game Changer Song ) ఎలా ఉంటుందో అనేది రివీల్ చేసారు.అయితే ఈ పోస్టర్ లో ఒకటి గమనిస్తే చరణ్ చేతిలో బుక్ పట్టుకుని ఉన్నాడు.

శంకర్ ఈ సినిమాను అనౌన్స్ చేసిన పోస్టర్ లో కూడా ఒక ఫైల్ పట్టుకుని కనిపిస్తాడు.మరి ఈ రెండిటికి మధ్య ఏదైనా లింక్ ఉందా శంకర్ ఈ రకంగా హింట్ ఇచ్చాడా అని అంతా చర్చించుకుంటున్నారు.మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు