మెగా 'గాడ్ ఫాథర్'తో మేకర్స్ ఫుల్ ఖుష్.. ఇక ప్రేక్షకులే చెప్పాలట!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడమే కాకుండా వాటిని వరుసగా పూర్తి చేస్తూ ఆర్డర్ లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ వయసులో కూడా ఏ మాత్రం రెస్ట్ లేకుండా వరుస షూటింగులతో బిజీ బిజీగా గడుపు తున్నాడు.

ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.

చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్.ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఆల్ మోస్ట్ పూర్తి చేసుకుంది.సాలిడ్ హంగులతో డైరెక్టర్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు వచ్చిన అవుట్ ఫుట్ తో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట.

ఈ అవుట్ పుట్ చూసిన తర్వాత ఈ సినిమాపై మేకర్స్ కు మరింత నమ్మకం వచ్చిందట.దీంతో ఈ సినిమాతో మెగాస్టార్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇప్పటి వరకు అయితే మేకర్స్ అంతా సిద్ధంగా ఉంచారు.

ఇకపై సినిమా రిలీజ్ తర్వాత ఇది హిట్టో ప్లాపో ఆడియెన్స్ డిసైడ్ చేయాలి.చూడాలి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ కనిపించడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు