సరికొత్త ఫీచర్ తో ఇన్‌స్టాగ్రమ్..!

ప్రస్తుత రోజులలో  ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరకు సోషల్ మీడియా వినియోగం, స్మార్ట్  ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో సోషల్ మీడియా యాప్స్ ఎప్పటికప్పుడు యూజర్స్ ను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి ప్రవేశ పెడుతూ ఉంటాయి.

యూజర్స్ కొరకు పోటాపోటీగా అనేక ఫ్యూచర్ లను సోషల్ మీడియా యాప్స్ ఎప్పటికప్పుడు ప్రవేశ పెడ్తున్నారు.తాజాగా ఇంస్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫ్యూచర్ అందుబాటులోకి తీసుకొని రాబోతుందిఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు అధిక స్థాయిలో డబ్బులను సొంతం చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.

ఇంస్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం వారి అకౌంట్ ద్వారా వాణిజ్య, వ్యాపారాలను నిర్వహించుకునే విధానంగా, అలాగే  బ్రాండెండ్ కంటెంట్ మార్కెట్‌ ప్లేస్‌ లతో సహా   అన్నిటి నుండి డబ్బు సంపాదించుకోవడానికి వీలు పడే విధంగా సరికొత్త ఫ్యూచర్ ను తీసుకొని రాబోతుంది ఈ  విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌ బర్గ్,  ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరితో లైవ్ స్ట్రీమ్ ద్వారా అందుబాటులోకి రానున్న ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలియజేశారు  దాని ఆధారంగా ఇంస్టాగ్రామ్ వినియోగదారులు వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వ్యాపారా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఈ ఫీచర్ బాగా సహాయపడుతుందని తెలుస్తోంది.చాలా మంది ఖాతాదారులు వారి వ్యాపార సంస్థను ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండటం కోసమే ఈ సరికొత్త ప్రవేశపెట్టనున్నట్లు మార్క్ జుకర్‌ బర్గ్ పేర్కొన్నారు.

ఈ ఫీచర్ ను  కస్టమర్స్ వినియోగిస్తూ వారి ప్రొడక్ట్స్ ను సులువుగా అమ్ముకోవచ్చని జుకర్‌బర్గ్ తెలిపారు.అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఉండే ఈ ఫ్యూచర్ ద్వారా  బ్రాండెడ్ కాంటాక్ట్ మార్కెట్లో కూడా సహాయపడుతుందని, అలాగే ఈ సరికొత్త ఫ్యూచర్ యూజర్స్  ముందుకు అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)

తాజా వార్తలు