ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నేటికీ ఈ దిగ్గజ యాప్ మార్కెట్లోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా జెన్‌జెడ్‌ను మరింతగా ఆకర్షించటానికి నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించడం విశేషం.కాగా ఈ ఫీచర్లు ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్నాయి.
త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి.అవేమిటో ఇక్కడ ఒక్కసారి చూద్దాము.
ఫేస్‌బుక్( Facebook )లో స్నేహితులు, బంధువుల పుట్టిన తేదీ రిమైండర్లు జనాలకి కొత్తేమీ కాదు.మెటా సంస్థ ఇప్పుడు దీన్ని ఇన్‌స్టాగ్రామ్( Instagram )కూ విస్తరించడం గమనార్హం.
ఇది ఫాలోయర్లకు, స్నేహితులకు మన పుట్టిన తేదీని గుర్తుచేస్తుందన్నమాట.
స్టికర్లు, కాన్ఫెటీలతో సెలబ్రేట్ చేసుకోవటానికీ వీలు కల్పిస్తూ దీన్ని మరింత ఆకర్షణీయంగానూ మలచడం కొసమెరుపు.కాగా మనం సాధారణంగా టైప్ చేయటానికి సమయం లేకపోవటమో, బద్ధకంతోనో ఆడియో నోట్స్ పంపిస్తుంటాం.ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే వాయిస్ మెసేజ్‌లు పోస్ట్ చేయటమూ తెలిసిందే.
మెటా( Meta ) దీన్ని మరింతగా తీర్చిదిద్ది నోట్స్‌లోనే అవకాశం కల్పించింది.ఇప్పుడిక నోట్స్ సెక్షన్ నుంచే ఆడియో మెసేజ్‌లను పోస్ట్ చేయొచ్చు.
ఇవి డీఎం జాబితాలో అన్నింటికన్నా పైన కనిపిస్తాయి.ఆడియో నోట్స్ మాత్రమే కాదు.
చిన్న వీడియోను రికార్డు చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు.
ఇకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్ ఫ్రెండ్స్( Close Friends )తో స్టోరీలను షేర్ చేసుకోవటం తెలిసిందే.మనం ఎంచుకున్న వారికే ఇవి కనిపిస్తాయి అన్న సంగతి తెలిసిందే.త్వరలో ఈ స్టోరీలకు మరిన్ని జాబితాలు జత చేరనున్నాయి.
అంటే స్నేహితులకు ఒకటి, కుటుంబానికి ఒకటి, తోటి ఉద్యోగులకు ఒకటి.ఇలా ఎవరికి ఏది చెప్పాలనుకుంటే దాన్ని స్టోరీగా వేర్వేరుగా షేర్ చేసుకొనే వీలుంది.
నోట్స్ లో లొకేషన్‌ను ట్యాగ్( Location tag ) చేయటానికి వీలు కల్పించే ఫీచర్‌నూ ఇన్‌స్టాగ్రామ్ పరీక్షిస్తోంది.యూజర్లు దీని ద్వారా తాము ఎక్కడున్నామో తెలియజేయొచ్చు.
ట్యాగ్ చేసిన లొకేషన్ నోట్స్‌లో టెక్స్ట్ మీద కనిపిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy